“పుష్ప – రంగస్థలం” మల్టీవర్స్ కాన్సెప్ట్ బానే ఉంది..! కానీ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

“పుష్ప – రంగస్థలం” మల్టీవర్స్ కాన్సెప్ట్ బానే ఉంది..! కానీ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Harika

Ads

సుకుమార్ దర్శకత్వం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటిది ‘పుష్ప: ది రైజ్’ పేరుతో విడుదల అవగా, రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్ గా ఎలా మారాడు అన్న విషయాన్ని చూపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రానున్న ఈ రెండో భాగం లో ఎంతో మంది స్టార్లను భాగం చేయనున్నట్లు తెలుస్తోంది.

Video Advertisement

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి. తమిళం లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకంటూ ఒక యూనివర్స్ క్రియేట్ చెయ్యడం కోసం వరుసగా సినిమాలు చేస్తూ.. హీరోలని, కొన్ని పాత్రలని అందులో భాగం చేస్తున్నాడు. ఇప్పుడు అదే ఫార్ములాని సుకుమార్ క్రియేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అందులో భాగం గానే పుష్ప 2 లో రామ్ చరణ్ ఎంట్రీ ని ప్లాన్ చేసారని సమాచారం..

is sukumar ttrying to creating a multiverse..??

రంగస్థలం లోని చిట్టి బాబు పాత్రని పుష్ప 2 లో పుష్ప రాజ్ తో కలపనున్నట్లు తెలుస్తోంది. కానీ అలా చూస్తే రంగస్థలం లో ఉన్న కొంత మంది నటులు పుష్ప లో ఉన్నారు. రంగస్థలం లో హీరోయిన్ అయిన సమంత పుష్ప లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అనసూయ కూడా రెండు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అలాగే నటులు అజయ్ ఘోష్, శత్రు కూడా ఈ రెండు చిత్రాల్లో వేర్వేరు పాత్రల్లో కనిపించారు. దీంతో సుకుమార్ మల్టీవర్స్ ని ఎలా క్రియేట్ చేయబోతున్నాడు అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.

is sukumar ttrying to creating a multiverse..??

ఇప్పటికే సుకుమార్ ఈ రెండు చిత్రాలు ఒకే కాలం లో జరిగినట్టు చూపించారు. కేవలం రామ్ చరణ్ చిట్టి బాబు పాత్ర వరకు పుష్ప రాజ్ తో కలపటం వరకు బాగానే ఉంటుంది గాని మిగతా పాత్రల్ని కూడా చూపించాలంటే కాస్త కష్టమే.. మరి సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి..


End of Article

You may also like