Ads
మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకి ఎన్నో రోజుల నుంచి మంచి హైప్ ఉంది. వస్తూ వస్తూనే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనుకునే సినిమా తీరా విడుదలైన తర్వాత యావరేజ్, అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. మామూలు ప్రేక్షకులకే కాకుండా మహేష్ బాబు వీరాభిమానులకు కూడా ఈ సినిమా కొంచెం నిరాశనే మిగిల్చింది.
Video Advertisement
మహేష్ బాబు ఈ సినిమాలో జీవించేసినా కూడా త్రివిక్రమ్ డైరెక్షన్, తమన్ పాటలు ఆ హైప్ ని ఇవ్వలేకపోయాయి. ఇది అసలు త్రివిక్రమ్ తీసిన సినిమాయేనా అని త్రివిక్రమ్ వీరాభిమానులు నిరాశ పడిపోతున్నారు. మామూలుగా త్రివిక్రమ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి వేరియేషన్ చూపిస్తారు కానీ గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ ముందు చేసిన సినిమాలన్నిటి కలయిక క్షుణ్ణంగా కనిపిస్తుంది.
ఈమధ్య అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది పెద్ద హీరోల సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు అభిమానులు. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న తర్వాత ఒక ఫ్యామిలీ డ్రామా మామూలు సినిమా అనేసరికి అందరూ తెగ నిరాశ పడిపోయారు. ఈ సినిమాలో కూడా చూడడానికి మహేష్ బాబు తప్ప ఇంకేది అంత ఆసక్తికరంగా లేదు. పాటలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, ఒక సరైన కథ లేదు బాబుకి హీరోయిజం సీన్స్ లేవు, కామెడీ అక్కడక్కడ వర్క్ అవుట్ అయినా కూడా బాబుని చూపించే రీతి ఇది కాదు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
అయినా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని కచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తర్వాత వచ్చేది రాజమౌళి సినిమా. అది రాడానికే కనీసం మూడేళ్లయినా పడుతుంది అప్పటివరకు స్క్రీన్ మీద చూసే వీలు కూడా ఉండదు. ఇప్పుడే చూసేయాలి. కానీ త్రివిక్రమ్ అలా వైకుంఠపురం సినిమా తర్వాత నాలుగేళ్లు టైం తీసుకుని ఇచ్చిన ఔట్పుట్ చాలామందిని సాటిస్ఫై చేయలేకపోయింది. కొంచెం కథ మార్చి, బాబుకి హీరోఇజం ఎక్కువ ఇచ్చుంటే హీట్ అయ్యేదేమో గుంటూరు కారం.
End of Article