ఆర్య సినిమాలో ఈ సీన్ గమనించారా..? 20 ఏళ్ల తర్వాత బయటికి వచ్చిన మిస్టేక్..!

ఆర్య సినిమాలో ఈ సీన్ గమనించారా..? 20 ఏళ్ల తర్వాత బయటికి వచ్చిన మిస్టేక్..!

by Harika

Ads

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్య. ఈ సినిమా విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వడం మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ కి గుర్తింపు తీసుకొచ్చింది. మొదటి సినిమాతోనే సుకుమార్ చాలా మంచి డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అను మెహతా, శివ బాలాజీ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవ్వడంతో ఒక ఈవెంట్ కూడా చేశారు. అలాంటి ప్రేమ కథ రావడం అదే మొదటిసారి. దాంతో సినిమా విడుదల అయ్యాక సినిమా గురించి చాలా సంవత్సరాలు చర్చించుకున్నారు. అంత లాజిక్ మాట్లాడుతూ, ప్రేమ కథని చూపించడం చాలా అరుదుగా జరుగుతుంది.

Video Advertisement

mistake in arya movie

ఈ సినిమాలో అలాగే జరిగింది. అందుకే సినిమా చాలా మందికి నచ్చింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ కూడా చాలా మంచి స్నేహితులు అయ్యారు. వారి స్నేహం ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ తర్వాత సినిమాలు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్య సినిమాలోని ఒక సీన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సినిమాలో సుబ్బరాజు హీరోలు, హీరోయిన్ వెంటపడిన తర్వాత ఒక బిల్డింగ్ మీదికి వెళ్తారు. అక్కడ హీరో జేబులో నుండి చాక్లెట్ తీసి తింటాడు. అయితే, చాక్లెట్ కవర్ లోపల, మరొక వైట్ కలర్ కవర్ ఉండి, దాని లోపల చాక్లెట్ ఉంటుంది. కానీ హీరో బయట ఉన్న చాక్లెట్ పేపర్ తీస్తాడు కానీ, లోపల ఉన్న వైట్ పేపర్ తీయకుండానే చాక్లెట్ తినేస్తాడు. అది సీన్ లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో, “చాక్లెట్ బయట ఉన్న కవర్ తీశారు కానీ, లోపల ఉన్న మరొక కవర్ తీయకుండా ఎలా తినేశారు” అంటూ ఈ సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి.

watch video :


End of Article

You may also like