ఇదేందయ్యా ఇది…”జనతా గ్యారేజ్” లో ఈ రెండు సీన్స్ ఎప్పుడైనా గమనించారా.?

ఇదేందయ్యా ఇది…”జనతా గ్యారేజ్” లో ఈ రెండు సీన్స్ ఎప్పుడైనా గమనించారా.?

by Mohana Priya

Ads

సినిమాల్లో పొరపాట్లు జరగడం అనేది సహజం. ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ సినిమా కథ, ఇంకా నటీనటులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం సినిమా చూస్తాం కాబట్టి ఈ పొరపాట్ల గురించి అంత పెద్దగా పట్టించుకోము. పొరపాట్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అంటే సీన్ మధ్యలోనే కాస్ట్యూమ్స్ మారిపోవడం. నటుల అప్పియరెన్స్, లేదా బ్యాక్ గ్రౌండ్ మారడం ఇలాంటివి ఒక రకం.

Video Advertisement

ఇంకొక రకం ఏంటంటే. సీన్ కి, సీన్ కి మధ్యలో ఇంటర్ లింకింగ్ ఉంటుంది. అంటే ఒక సీన్ లో ఏదైనా ఒక విషయం పాయింట్ అవుట్ చేస్తే, అందులోనూ అది ముఖ్యమైన విషయం అయితే, ఆ పాయింట్ ఆ తర్వాత జరిగిన సినిమాలో కూడా మధ్య మధ్యలో క్యారీ అవుతుంది. ఒక వేళ తర్వాత ఆ పాయింట్ మారితే అది కూడా పొరపాటు కిందకే వస్తుంది. జనతా గ్యారేజ్ లో కూడా ఇలాంటి పాయింట్ ఒకటి తర్వాత మారింది. అది ఏంటంటే.

సత్యం పాత్ర పోషించిన మోహన్ లాల్ వాళ్ళ కొడుకు రాఘవ (ఉన్ని ముకుందన్), ముఖేష్ నాథ్ (సచిన్ ఖేడేకర్) వాళ్ల కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక రోజు రాత్రి పూట రాఘవ, తన భార్య తాగి ఇంటికి వస్తారు. అలా రావడాన్ని హీరో చూస్తాడు. తర్వాత మోహన్ లాల్ కూడా చూస్తారు.

మరుసటి రోజు హీరో వచ్చి అలా అర్ధ రాత్రి తాగి ఇంటికి రావడం కొంచెం తగ్గించమని, ఇంట్లో పెద్ద వాళ్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తాడు. అప్పుడు చిన్న గొడవ అవుతుంది. తర్వాత హీరో “నో మోర్ పార్టీస్” అని చెప్తాడు.

కానీ తర్వాత పక్కా లోకల్ పాట వస్తుంది. అజయ్ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత, ఒక ధాబా లో ఈ పాట వస్తుంది. అంటే ఆ పాట వచ్చే సందర్భం కూడా పార్టీయే. ఇందాక పైన చెప్పినట్లుగా పాయింట్ మిస్ అవ్వడం అంటే ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది.

కానీ ఏదేమైనా దీని వల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ కలగలేదు కాబట్టి జనాలు కూడా అసలు దీన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు ” అదేంటి? ఇందాక అలా అన్నారు కదా?” అని  అనిపిస్తుంది అంతే.

 


End of Article

You may also like