ఖలేజా సినిమా చాలాసార్లు చూసి ఉంటారు..! కానీ ఈ మిస్టేక్ గమనించారా..?

ఖలేజా సినిమా చాలాసార్లు చూసి ఉంటారు..! కానీ ఈ మిస్టేక్ గమనించారా..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఖలేజా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన కలెక్షన్స్ సాధించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని చాలా బాగా ఇష్టపడ్డారు. ఇప్పటికి కూడా ఈ సినిమాని టీవీలో వస్తే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అసలు ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్థం కాలేదు అంటూ ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రధారణ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పటి వరకు సీరియస్ పాత్రల్లో చూసిన మహేష్ బాబుని ఈ సినిమాలో ఒక కామెడీ పాత్రలో ఆడియన్స్ చూశారు.

Video Advertisement

mistake in khaleja movie

మహేష్ బాబు లుక్ కూడా స్టైలిష్ గా, డిఫరెంట్ గా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. మణిశర్మ పాటలు ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యాయి. అన్నీ ఉన్నా కూడా ఈ సినిమా అప్పుడు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. కానీ మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక పొరపాటు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదల అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పుడు ఈ పొరపాటు గురించి మాట్లాడుకుంటున్నారు.

అదేంటంటే, హీరో ఎంట్రీ తర్వాత ఇసుకలో నుండి ఒక బైక్ తీసి డ్రైవ్ చేస్తాడు. అది ఎడారి. అక్కడ చుక్క నీళ్లు కూడా దొరకవు. ఆ బైక్ చూస్తే ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అలాంటి బైక్ హీరో ఒక్కసారి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. “అసలు అంత కాలం నుండి అక్కడ అలా ఉన్న బైక్ ఒక కిక్ కి ఎలా స్టార్ట్ అయ్యింది?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “అసలు అలాంటి బైక్ ఒకటి ఎడారిలో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు వాడకుండా ఏం చేస్తున్నారు?” అంటూ కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like