2019 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). ఈ సినిమాలో కామెడీ అందరిని అలరించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మేనరిజమ్స్, అంతేగా అంతేగా, హనీ ఈజ్ ద బెస్ట్ లాంటి డైలాగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి.మనం బహుశా సినిమా చూసినప్పుడు గమనించలేదు కానీ, ఈ సినిమా లో కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే కథ పరంగా కాదు, కొన్ని సీన్స్ లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ మొదట కలుసుకున్నప్పుడు గొడవ పడుతూ ఉంటే ఆపడానికి మెహరీన్ వెళ్తుంది. అప్పుడు వెంకటేష్ తనని గుర్తు పట్టకుండా ఉండడానికి మొఖానికి ఒక స్కార్ఫ్ కట్టుకుంటుంది మెహరీన్.

వరుణ్ తేజ్ తో కలిసి బయటికి వచ్చిన తర్వాత ఆ స్కార్ఫ్ మెడ పైకి ఉంటుంది. ఆ తర్వాత వెంకటేష్ వచ్చి వరుణ్ తేజ్, మెహరీన్ తో మాట్లాడినప్పుడు, వాళ్లిద్దరూ వెంకటేష్ కి దొరకకుండా పరిగెడుతున్నప్పుడు కూడా స్కార్ఫ్ మెడ పైకే ఉంటుంది. కానీ తర్వాత వరుణ్ తేజ్ ఇంకా మెహరీన్ ఒక ఇంట్లోకి వెళ్లేటప్పుడు మాత్రం స్కార్ఫ్ బ్యాగ్ కి వేలాడదీసి ఉంటుంది.

పైన కనిపించే సీన్ సినిమా క్లైమాక్స్ కి కొంచెం ముందు వస్తుంది. నాజర్ వెంకటేష్ ని, వరుణ్ తేజ్ ని, రాజేంద్ర ప్రసాద్ ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. తర్వాత వాళ్ల ముగ్గురితో కూర్చొని మాట్లాడుతారు నాజర్. అప్పుడు ఒకసారి చూపించినప్పుడు టేబుల్ మీద పక్కపక్కన రెండు చోట్ల కొన్ని బుక్స్ ఉంటాయి. కానీ నెక్స్ట్ షాట్ లో ఒక సెట్ బుక్స్ మాత్రమే ఉంటాయి. ఇదే కాకుండా ఈ సినిమాలో ఇంకా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

watch video:

 


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com