Ads
విజయ్ దేవరకొండ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి గీత గోవిందం. 2018 లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహించగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. గీత గోవిందం సినిమా అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇంకేం ఇంకేం కావాలే. ఈ పాట మాత్రమే కాకుండా గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
Video Advertisement
ఈ సినిమాకి రష్మిక మందన పర్ఫామెన్స్ కూడా హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పొరపాటు ఉంది. అది ఏంటంటే. మొదట హీరోయిన్ హీరో ని అపార్థం చేసుకుంటుంది. తర్వాత హీరో వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ తల్లి, హీరోయిన్ కి హీరో గురించి చెప్పడంతో అప్పటివరకు హీరో ని తప్పుగా అర్థం చేసుకున్న గీత తర్వాత ప్రేమిస్తుంది.
అప్పుడు ఏంటి ఏంటి పాట వస్తుంది. అయితే ఆ పాటలో ఒక సీన్ లో కారులో హీరో నిద్ర పోతూ ఉంటే పక్కనుంచి హీరోయిన్ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే బయట నుంచి ఒకరు డిస్టర్బ్ చేయడంతో సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్ మళ్లీ మామూలుగా కూర్చుంటుంది. అదే పాటలో తర్వాత ఒక సీన్ లో హీరోయిన్ లాప్టాప్ స్క్రీన్ మీద వాల్ పేపర్ గా హీరోయిన్ హీరో తో సెల్ఫీ తీసుకుంటున్న పిక్చర్ ఉంటుంది.
అది కూడా సెల్ఫీ పిక్చర్ కాకుండా మనకి ఏ విధంగా అయితే చూపిస్తారు అదే విధంగా ఉంటుంది. దీన్ని పొరపాటు అనడం కూడా చాలా పెద్ద పదం ఏమో. కానీ ఏదేమైనా దీనివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి ప్రేక్షకులు కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు.
watch video:
End of Article