Ads
రాజకీయాల్లోకి ఎంటర్ ఆయిన తర్వత పవన్ కళ్యాణ్ చాలా రోజులు వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో లాయర్ సత్య దేవ్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ అందరిని తన నటనతో ఆకట్టుకున్నాడు.
Video Advertisement
ఈ మూవీలో ప్రకాష్ రాజ్ తో కలిసి వకీల్ సాబ్ నటించిన లాస్ట్ కోర్టు సీన్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచింది అనడం లో ఏటువంటి సందేహం లేదు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం కథ లోని టెంపో ని బాగా మెయింటైన్ చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో వకీల్ సాబ్ తో పాటు ఆ ముగ్గురు అమ్మాయిల క్యారెక్టర్స్ కూడా ఎంతో అద్భుతంగా నిర్మించబడ్డాయి.నివేదా థామస్ మరియు అంజలి తమ నటనతో అద్భుతమైన భావోద్వేగాలను పలికించి సినిమా లోని క్యారెక్టర్స్ కి న్యాయం చేశారని చెప్పవచ్చు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ ప్రాణం పోసింది. “మగువా మగువా” పాట ప్రస్తుతం మన సమాజంలో ఆడవారు ఎదుర్కొనే సమస్యలను ఎత్తిచూపడంతో పాటు మన జీవితంలో ఆడవారికి ఎంత ప్రాధాన్యత ఉందో కూడా తెలుపుతుంది.
కానీ ఈ చిత్రం రిలీజ్ అయిన కొన్ని రోజులకు చాలామందికి వాటిలో అక్కడక్కడ జరిగిన తప్పిదాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ చిత్రంలో దొర్లిన తప్పుల గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. జరిగిన తప్పుల గురించి మాట్లాడడమే కాకుండా ఏ సన్నివేశాల్లో ఎక్కడ ఎలా తప్పులు జరిగాయో వివరిస్తూ వీడియోలు కూడా తయారు చేస్తున్నారు. మరి వకీల్ సాబ్ లో దొర్లిన ఆ తప్పులు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింది వీడియోను పూర్తిగా చూడండి…
End of Article