RADHE SHYAM: ఏంటి “రాధే శ్యామ్”లో ఇన్ని తప్పులా.? ఈ పొరపాట్లని గమనించారా.?

RADHE SHYAM: ఏంటి “రాధే శ్యామ్”లో ఇన్ని తప్పులా.? ఈ పొరపాట్లని గమనించారా.?

by Harika

Ads

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్. డైరెక్టర్ కే రాధా కృష్ణ కుమార్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. నాలుగేళ్లుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది రాధే శ్యామ్. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రేమకథ చిత్రం అని ఇండస్ట్రీలో టాక్.

Video Advertisement

బాహుబలి తర్వాత ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన సాహూకి తెలుగులో పెద్దగా వసూళ్లు రాకపోయినా, బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత రాధే శ్యామ్ తో మరో పాన్ ఇండియా ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమాలో యూరప్ లోకేషన్లు, కొన్ని ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు సీన్లు లేకపోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.

అయితే ఈ భారీ బడ్జెట్ ప్రేమకథ చిత్రంలో కూడా అనేక మిస్టేక్స్ చేశారు మేకర్స్. వీటిని గుర్తించిన నెటిజన్లు ఎక్కడ ఎక్కడ ఏం తప్పు చేశారు, ఏ సీన్ ఎక్కడ నుంచి కాపీ కొట్టారో చూపిస్తూ అనేక మీమ్స్ క్రియేట్ చేసారు. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ మిస్టేక్స్ కి సంబంధించిన వీడియోలో అప్లోడ్ చేశారు. రాధే శ్యామ్ సినిమాలో జరిగిన ఆ పొరపాట్లు ఏంటో  కింద ఉన్న వీడియోలో ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసేయ్యండి..

ఈ సినిమాపై ప్రముఖ నటులు పరుచూరి గోపాల కృష్ణ రివ్యూ ఇచ్చారు. ఇందులో గోపాల కృష్ణ మాట్లాడుతూ సినిమా ఇలా రావడానికి కారణాలు ఏంటో చెప్పారు. “ఈ సినిమాని చూస్తూ ఉంటే పాతాళభైరవి అలాగే పాత మల్లీశ్వరి సినిమాలు గుర్తొచ్చాయి” అని అన్నారు. తన అంచనా ప్రకారం ఒకవేళ పాతాళభైరవి కంటే ముందు మల్లీశ్వరి విడుదల అయ్యి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అని అన్నారు.

paruchuri gopala krishna review on radhe shyam

అలాగే “రాధే శ్యామ్ సినిమాలో పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే లాగా లేవు” అని అన్నారు. అలాగే ఫైట్స్ కూడా మిస్ అయ్యాయి అని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత కృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని అలాగే రాధే శ్యామ్ కి కూడా జరిగింది అని అన్నారు. సినిమా లైన్ బాగున్నా కూడా టైటిల్ కరెక్ట్ కాదు అని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా చూడాలి అని చెప్పారు. పరుచూరి గోపాల కృష్ణ ఈ సినిమా గురించి చెప్పిన వాటిపై చాలా మంది నెటిజన్లు కూడా కరెక్ట్ అని అంటున్నారు.

watch video :


End of Article

You may also like