మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ సూపర్ స్టార్..?

మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ సూపర్ స్టార్..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం గురించిన ప్రచారాలు తరచు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Video Advertisement

ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత జక్కన్న సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అయితే తాజాగా మహేష్-జక్కన్న సినిమాలో ముఖ్యమైన పాత్రలో ఒక స్టార్ హిరో నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.  రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.

Also Read: “కోట్లు పెట్టి సినిమా తీస్తే సరిపోదు… ఇవి కూడా చూసుకోలేరా..?” అంటూ… “ఆదిపురుష్” డైరెక్టర్‌పై కామెంట్స్ ఏం జరిగిందంటే..?


End of Article

You may also like