Ads
article sourced from: samayam telugu
Video Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో హీరోకి ఒక్కో స్టైల్ ఉంటుంది అలాగే సీనియర్ హీరోస్ లో మోహన్ బాబు గారు కూడా అంతే. అయన ముక్కు సూటి మనిషి ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. చాలా క్రమశిక్షణ మైన వ్యక్తి కూడా. గతం లో మోహన్ బాబు గారు చేసిన కొన్ని స్టేట్మెంట్స్, కామెంట్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది.
సమయం కధనం ప్రకారం.. ఇటీవల ఆయన ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని దూషించారంటూ పలు ఆరోపణలు వచ్చాయి.
అయితే.. ఆ ఆరోపణల్లో నిజం లేదని నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు చెబుతున్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు .. మోహన్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, వేల మందికి కుల వివక్ష లేకుండా ఆయన కాలేజీ లో సీట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే.. నాగ శ్రీనుని కులం పేరిట దూషించారన్న ఆరోపణలు సరికాదన్నారు.
ఆర్ కృష్ణయ్య, నాగబాబు కావాలనే మోహన్ బాబుపై లేని పోని ఆరోపణలను గుప్పిస్తున్నారన్నారు. మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న ఓ దళిత అమ్మాయితో నాగ శ్రీను సాహచర్యం చేస్తున్నారని.. ఆమెను గర్భవతిని కూడా చేసారని చెప్పుకొచ్చారు. అయితే.. ఆమె గర్భవతి అవ్వడంతో అబార్షన్ కూడా చేయించారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ నాగశ్రీను భార్యే మోహన్ బాబు కు చెప్పిందన్నారు. ఈ విషయమై మోహన్ బాబు నాగశ్రీనుని నిలదీయడంతోనే అతను ఇంట్లోంచి వెళ్లిపోయారన్నారు.
తనని మందలించారు అన్న కోపంతోనే నాగశ్రీను మోహన్ బాబు, మంచు విష్ణులపై ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. ఓ దళిత అమ్మాయిని మోసం చేసిన వ్యక్తికి ఆర్.కృష్ణయ్య సపోర్ట్ ఇవ్వడం సరికాదన్నారు. నాగశ్రీనుకి నాగబాబు యాభైవేల రూపాయలు ఇచ్చి మోహన్ బాబు కుటుంబాన్ని తిట్టిస్తున్నారని మోహన్ బాబు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అవ్వడాన్ని చూసి సహించలేకే నాగబాబు ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
End of Article