బిగ్ బాస్ తెలుగు సీజన్ 4  గ్రాండ్ ఫినాలేకి ఇంకా వారం రోజులు ఉన్నప్పుడు, టాప్ సిక్స్త్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు మోనాల్ గజ్జర్. మొదట్లో మోనాల్ తెలుగు రాక కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత తెలుగు నేర్చుకున్నారు.

monal remuneration for special song

అంతే కాకుండా టాస్క్ విషయంలో కూడా చాలా మంది మోనాల్ వీక్ అని అన్నారు. కానీ తర్వాత టాస్క్ విషయంలో కూడా మోనాల్ మెల్లగా డెవలప్ అయ్యారు. అన్నిటికీ కొంచెం ఎమోషనల్ అయినా కూడా గేమ్ లో మాత్రం పోటీపడి ఆడారు. కింగ్ నాగార్జున కూడా మోనాల్ తెలుగు నేర్చుకోవడం, టాస్క్ లో బాగా ఆడడం చూసి చాలా సార్లు మెచ్చుకున్నారు.

monal remuneration for special song

ప్రస్తుతం మోనాల్, ఓంకార్ యాంకర్ గా స్టార్ మాలో ఇటీవల మొదలైన డాన్స్ ప్లస్ లో ఒక జడ్జి గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక స్పెషల్ పాటలో కనిపించబోతున్నారు అంట. ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం  ఈ పాట కోసం మోనాల్ 15 లక్షల పారితోషికం అడిగారట.

monal remuneration for special song

అంతేకాదు “ఓంకార్ డాన్స్ షో ‘డాన్స్ ప్లస్’కి జడ్జిగా వ్యవహరిస్తునందుకు ఎపిసోడ్ కి రూ.50 వేలు పారితోషికం అందుకుంటున్నారంట. బిగ్ బాస్ షో నుండి 30 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో స్వయంగా మోనాల్ చెప్తేగాని తెలీదు. బిగ్ బాస్ సెలెబ్రిటీల గురించి ఇలాంటి గాసిప్స్ అన్ని సహజమే కదా.?

ఇంక అల్లుడు అదుర్స్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాకి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్, అనూ ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోను సూద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.