Ads
మామ కోడళ్ల రిలేషన్ లాగ, అత్తా అల్లుడులకి కూడా చెప్పలేని కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ చుట్టూ సున్నితం గా కధని అల్లి సినిమా గా మలిచి మన ముందుకు తీసుకొచ్చారు. అత్తా కోడళ్ల గొడవలు ఎప్పటికి బోర్ కొట్టకుండా ఎలా ఉంటాయో.. అలానే, అత్తా అల్లుడి సాధింపులు కూడా అంతే. అత్త పై అల్లుడు ఎలా నెగ్గాడు..? అత్త పెట్టిన కండిషన్లు, అల్లుడు చూపించిన సత్తా.. ఇలా చెప్పుకుంటూ పొతే.. అత్తా అల్లుడి రిలేషన్ మధ్య సినిమా లో ఎలివేట్ చేసుకోవడానికి చాలా పాయింట్ లే ఉంటాయి. క్రియేటివిటీ కి తగ్గట్లు ఈ రిలేషన్ ను సినిమాలో అందం గా చూపించొచ్చు.
Video Advertisement
అందుకే మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎప్పుడు ఇలాంటి క్రియేటివ్ అంశాల్ని వాడుకోవడం లో ముందుంటారు. అలా అత్తా, అల్లుడుల కధాంశం తో మన ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమా ల లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం..
#1 గుండమ్మ కథ :
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబో అంటే వేరే లెవెల్ ఉండేది. వీరికి సూర్యకాంతం జత కలిసింది. గుండమ్మ కథ సూపర్ హిట్ గా నిలిచింది.
#2 బొబ్బిలి రాజా:
వెంకటేష్, దివ్య భారతి కాంబో లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ కు అత్తా గా అలనాటి హీరోయిన్ వాణిశ్రీ నటించారు.
#3 అనసూయమ్మ గారి అల్లుడు, నారి నారి నడుమ మురారి
ఈ రెండు సినిమాల లోను అల్లుడి గా బాల కృష్ణ నటించారు. అనసూయమ్మ గారి అల్లుడు సినిమా లో హీరోయిన్ గా భానుప్రియ నటించగా, అత్త గా శారద నటించింది. నారి నారి నడుమ మురారి సినిమా లో హీరోయిన్లు గా శోభన, నిరోషా రాధ నటించారు. ఇందులో కూడా అత్త గా శారద గారే నటించారు.
#4 నా అల్లుడు
ఎన్టీఆర్ అల్లుడు గా నటించిన ఈ సినిమా లో శ్రీయ, జెనీలియా హీరోయిన్లు గా నటించారు. అందాల నటి రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్త గా నటించి అలరించారు.
#5 అత్తారింటికి దారేది
ఈ సినిమా లో మోడరన్ అత్త గా నదియా కనిపించగా అల్లుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు.
#6 అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు :
ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జునే హీరో గా నటించాడు. అల్లరి అల్లుడు సినిమా లో మీనా, నగ్మా హీరోయిన్లు గా నటించగా, వాణిశ్రీ అత్త గా నటించింది. ఘరానా బుల్లోడు సినిమా లో రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లు గా నటిస్తే.. జయచిత్ర అత్తగా నటించింది.
#7 శైలజా రెడ్డి అల్లుడు :
శైలజా రెడ్డి అల్లుడు సినిమా లో నాగ చైతన్య అల్లుడి గా నటించగా, రామికృష్ణ అత్త పాత్ర పోషించారు. ఈ సినిమా లో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించారు.
#8 రౌడీ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అల్లుడా మజాకా :
అందరికంటే ఎక్కువ సార్లు మెగాస్టార్ అల్లుడి గా నటించారండోయ్. రౌడీ అల్లుడు లో దివ్య భారతి, శోభన హీరోయిన్లు గా నటించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా లో విజయశాంతి, వాణిశ్రీ నటించారు. అన్నపూర్ణ, అంజలి దేవి గార్లు కూడా ముఖ్య పాత్ర పోషించారు. అల్లుడా మజాకా సినిమా లో రమ్య కృష్ణ, రంభ హీరోయిన్ లు గా నటించారు.
End of Article