స్టార్ యాంకర్ గా సుమ  అందరికి సుపరిచితం. సుమ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సుమ తన యాంకరింగ్ తో బుల్లితెరపై ప్రత్యేకస్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎంటర్టైన్మెంట్ ,ప్రీ రిలీజ్ ,సినీ అవార్డు ఫంక్షన్ లలో తన హోస్టింగ్ తో సందడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. సుమ హోస్ట్ చేసే కాష్ ప్రోగ్రాంకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.suma n
సెలబ్రిటీలతో సందడిగా సాగే ఈ ప్రోగ్రాం లో సుమ అందరిని ఆటపట్టిస్తూ ఉంటుంది. వారు కూడా అలానే సుమ పై జోక్స్ వేస్తూ సరదాగా తీసుకుంటారు . ఐతే తాజాగా కాష్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో బాబూమోహన్ , గౌతమ్ రాజు, రాజ్య లక్ష్మి, శివపార్వతి పాల్గొన్నారు. సుమ పై రాజ్యలక్ష్మి కామెంట్ చేసారు. సుమ రాజ్యలక్ష్మితో… ఇవాళ నాకు కాంపిటేషన్ గా వచ్చారు అనడం తో, రాజ్య లక్ష్మి.. తాను చిన్నప్పుడు ఎప్పుడో లంగా ఓణీలు వేసుకుంటే నువ్వు మాత్రం ఇప్పటికి వేసుకుంటున్నావ్.. నాకు నిన్ను చూస్తే అసూయగా ఉంది అని అన్నారు. దీంతో సుమ ఏంటి నేను ఇంత వయసు వచ్చిన లంగా ఓణీలు వేసుకుంటున్నాననా… అని అనడం తో అక్కడ ఉన్న అందరు నవ్వుకున్నారు . ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.