ప్రేమలు నచ్చిందా… ఇది దానికంటే బెస్ట్ సినిమా..! దీని స్టోరీ ఏంటంటే..?

ప్రేమలు నచ్చిందా… ఇది దానికంటే బెస్ట్ సినిమా..! దీని స్టోరీ ఏంటంటే..?

by Harika

Ads

ఇటీవల ఒక మలయాళం నుండి తెలుగుకి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన సినిమా గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ప్రేమలు. ఇప్పుడు ఇదే సినిమా ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు కూడా ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ తరహా జోనర్ సినిమాలు ఇంకా ఏవేవి ఉన్నాయి అని తెలుసుకోవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా డైరెక్టర్ గిరీష్ దర్శకత్వం వహించిన మరొక సినిమా ఇంతకంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా పేరు సూపర్ శరణ్య. పేరు వినడానికి ఎంత కామెడీగా ఉందో, సినిమా అంతకంటే ఎక్కువ కామెడీగా ఉంటుంది. ఈ సినిమా శరణ్య అనే ఒక టీనేజ్ అమ్మాయి మీద తీశారు.

Video Advertisement

movie better than premalu

టీనేజ్ సమయంలో ఒక అమ్మాయి ఎదుర్కొనే సంఘటనలని చాలా కామెడీగా చూపించారు. హాస్టల్ లో ఆ అమ్మాయికి ఒక గ్యాంగ్, వాళ్ళు చేసే అల్లరి అదంతా కూడా చాలా బాగా ఈ సినిమాలో చూపించారు. ప్రేమలు సినిమా నచ్చినట్టు అయితే, ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించగా, ప్రేమలు సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. జీ ఫైవ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మలయాళం భాషలో ఈ సినిమా అందుబాటులో ఉంది. జస్టిన్ వర్గీస్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.

movie better than premalu

ఈ సినిమాలో నటించిన వారి నటన కూడా చాలా అమాయకంగా ఉంటూనే, కామెడీ తెప్పిస్తుంది. ప్రేమలు సినిమా లాగానే ఈ సినిమా స్టోరీ కూడా సింపుల్ గానే ఉంటుంది. కాకపోతే టేకింగ్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా మొదటి నుండి చివరి వరకు నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ముఖ్యంగా కాలేజ్ సమయంలో హాస్టల్ లో ఉన్నవారు అయితే చాలా సీన్స్ కి రిలేట్ కూడా అవుతారు. వారం వారం తమ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత మళ్లీ హాస్టల్ కి రావడం అవన్నీ కూడా ఇందులో బాగా చూపించారు. చాలా సీన్స్ సహజత్వానికి దగ్గరగా తీశారు.

ALSO READ : “ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి క్లైమాక్స్‌లో ఇలా చేశారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా మీద వ్యాఖ్యలు..! ఈ సీన్ గమనించారా..?


End of Article

You may also like