ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమా చూశారా..? ఆ సినిమా లాగానే ఇది కూడా హిట్ అయినట్టేనా..?

ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమా చూశారా..? ఆ సినిమా లాగానే ఇది కూడా హిట్ అయినట్టేనా..?

by kavitha

Ads

ది కాశ్మీర్ ఫైల్స్ తో గత ఏడాది సెన్సేషనల్ హిట్ సాధించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా ‘ది వ్యా-క్సి-న్ వార్’ తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో నానా పాటేకర్ లీడ్ రోల్ లో నటించారు.

Video Advertisement

కరోనా సమయంలో జరిగిన వాస్తవ పరిస్థితుల ఆధారంగా ‘ది వ్యా-క్సి-న్ వార్’ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీని ప్రభాస్ సలార్‌ పోటీగా ఈ మూవీ రిలీజ్ ప్రకటించారు. కానీ సలార్ రిలీజ్ వాయిదా పడింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. బాలీవుడ్‌లో పలు చిత్రాలకు దర్శకత్వం చేసినా, రాని గుర్తింపు ఈ మూవీతో వివేక్ అగ్నిహోత్రికి వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ది వ్యా-క్సి-న్ వార్ మూవీలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, రైమా సేన్, సప్తమి గౌడ గిరిజా ఓక్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ కి డైరెక్టర్ గా డాక్టర్ భార్గవ(నానా పాటేకర్) పని చేస్తుంటారు. ఆయన తన టీమ్ తో కలిసి న్యుమోనియా అరికట్టడానికి వ్యా-క్సి-న్ కనిపెట్టడానికి వర్క్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే కరోనా ప్రపంచం అంతటా విరుచుకుపడుతుంది. మీడియాలో వచ్చే కరోనా వార్తలతో ప్రజలందరూ భయపడుతుంటారు.
కరోనా సోకి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నేషనల్ వైరాలజి ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి) కోవిడ్ కు వ్యా-క్సి-న్ కనిపెట్టేందుకు భార్గవ టీమ్ తో కలిసి వర్క్ చేయడానికి ముందుకు వస్తుంది. మగవాళ్లే భయపడి ముందుకు రాని టైమ్ లో మహిళా సైంటిస్టులు ముందుకు వస్తారు. డాక్టర్ భార్గవ, డాక్టర్ అబ్రహం టీమ్స్ వ్యా-క్సి-న్ తయారీలో ఎలా విజయం సాధించారు? ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అనేది మిగిలిన కథ.

Also Read: హీరో అవుతాడనుకున్న ఆ యాక్టర్ కొడుకు.. మంచానికే పరిమితం అయ్యాడు..! అసలు ఏం జరిగిందంటే..?


End of Article

You may also like