హీరో అవుతాడనుకున్న ఆ యాక్టర్ కొడుకు.. మంచానికే పరిమితం అయ్యాడు..! అసలు ఏం జరిగిందంటే..?

హీరో అవుతాడనుకున్న ఆ యాక్టర్ కొడుకు.. మంచానికే పరిమితం అయ్యాడు..! అసలు ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

టాలీవుడ్ లో అద్భుతమైన నటులు ఎందరో ఉన్నారు. వారిలో తెలుగువాళ్లే కాకుండా ఇతర భాషల నుంచి వచ్చినవారు ఉన్నారు. తెలుగువారు కానప్పటికీ  తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడివాళ్ల కన్నా ఎంతో గుర్తింపును, క్రేజ్ ను సొంతం చేసుకున్న నటులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి నటులలో నాజర్ అగ్రస్థానంలోఉంటారని చెప్పవచ్చు.

Video Advertisement

ఆయనది తమిళనాడు అయినా సుమారు 6 భాషల్లో వందల చిత్రాలలో నటించారు. ఆడియెన్స్ అలరిస్తూ నటుడిగా విజయం సాధించిన నాజర్, వ్యక్తిగత జీవితంలో విషాదం చోటుచేసుకుంది. హీరో అవుతాడుకున్న కొడుకు, మంచానికే పరిమితం అయ్యాడు. అతనికి ఎవరు గుర్తులేరు. ఒక్క హీరో మాత్రమే గుర్తున్నాడు. మరి నాజర్ కుమారుడికి ఏమైందో ఇప్పుడు చూద్దాం.. నాజర్ అసలు పేరు మహమ్మద్ హనీఫ్‌. విలక్షణ నటుడు నాజర్ గురించి, ఆయన నటన గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది. నాజర్ తమిళనాడులో మేలేరిపాక్కంలో మెహబూబ్ బాషా,ముంతాజ్‌లకు  1958లో మార్చి 5న జన్మించాడు. ఇండస్ట్రీకి రాకముందు నాజర్ భారత వైమానిక దళంలో పనిచేశాడు. ఆ తరువాత   నటనలో  శిక్షణ పొందాడు. 1985లో నాజర్ నటుడిగా  కెరీర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి దాదాపు 600 పైగా సినిమాలలో నటించారు.
కెరీర్  పరంగా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో అలరించిన నాజర్ కి ముగ్గురు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు అబ్దుల్ ఫైజల్ హస్సన్, రెండో కుమారుడు లూత్ఫుద్దీన్ మరియు మూడవ కుమారుడు అబి హస్సన్. లూత్ఫుద్దీన్ కోలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా విజయ్ దళపతి చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు.  అయితే పెద్ద అబ్బాయి ఫైజల్ 2014 లో మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఫైజల్ కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అయితే అభిమాన హీరో అయిన విజయ్ దళపతి మాత్రమే అతనికి గుర్తున్నాడు.
టీవిలో విజయ్ దళపతి సినిమాలు గాని, పాటలు గాని వచ్చినపుడు ఫైజల్ సంతోషంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడట. ఎక్సయిట్మెంట్ తో విజయ్ సినిమాలు చూస్తుంటాడట. ఇటీవల జరిగిన ఫైజల్ బర్త్ డేకు  విజయ్ హాజరై ఫైజల్ ను సర్ప్రైజ్ చేసాడు. నాజర్ ఫైజల్ యాక్సిడెంట్ గురి కావడానికి కొద్ది రోజుల ముందు అతను హీరోగా ఒక సినిమాకి సన్నాహాలు చేసుకున్నారు. కానీ యాక్సిడెంట్ జరగడంతో గత తొమ్మిదేళ్లుగా బెడ్ పై, వీల్ చైర్ సాయంతో కొడుకు జీవిచడం నాజర్ ని వేదనకు గురిచేస్తోంది.

Also Read: CHANDRAMUKHI 2 REVIEW : “రాఘవ లారెన్స్, కంగనా రనౌత్” మొదటి పార్ట్ మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like