Ads
సీరియల్స్ తో తన కెరీర్ ని ప్రారంభించి తెలుగు సినిమా ని ప్రపంచం నలుమూలలన వ్యాపిపింపచేసిన దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’. ఇందులో ముమ్మాటికీ సందేహం లేదు. అంతేకాదు ఆయనతో పని చేసిన హీరోలకి కూడా బిగ్ బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్ కి స్టూడెంట్ no1 , ప్రభాస్ కి ఛత్రపతి, బాహుబలి. రామ్ చరణ్ కి ‘మగధీర’.
Video Advertisement
ఇలా హీరోలకి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ల నిలిచేలా సినిమాలని తీర్చి దిద్దారు రాజమౌళి. మరి అంత హిట్టు కొట్టాలన్న, ప్రేక్షకుల చేత జేజేలు కొట్టాలన్న ఆ స్టోరీ వెనుక, సీన్స్ వెనుక ఆయన చేసిన పనితనం అంత ఇంత కాదు.
అయితే.. రాజమౌళి కెరీర్ లో కూడా ఒక ప్లాప్ ఉంది. ఆయన దర్శకుడిగా చేసిన సినిమా కాదు. రాజమౌళి కూడా ఓ సినిమాలో నటించారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఆ సినిమా “రెయిన్ బో..” ఈ సినిమా తీసిన దర్శకుడు ఆదిత్య కూడా నష్టపోయారు. నిజానికి ఈ సినిమాలో నటించడం రాజమౌళికి ఇష్టం లేదట. కాని దర్శకుని మాట కాదనలేక నటించారట.
End of Article