Ads
గత సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. సూర్యని చూసిన వారు అందరూ, సూర్య మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించారు.
Video Advertisement
లాయర్ చంద్రు నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ఓటిటి లో రిలీజ్ అయిన ఈ చిత్రం నిజంగానే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు తమిళ ప్రేక్షకులను, ఇటు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక సినిమాను షూట్ చెయ్యాలి అంటే దాని వెనుక కొన్ని నెలల తరబడిన శ్రమ ఉంటుంది. కొన్ని వందల మంది అందుకోసం పని చేస్తూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అలానే.. సూర్య “జై భీమ్” మూవీ లో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి.
ఈ సినిమాలో రాజన్న పారిపోయాడు అని చెప్పడానికి ఓ పోలీస్ ఆఫీసర్ చినతల్లి ఇంటికి వస్తాడు కదా.. అక్కడ కూడా ఓ పొరపాటు జరిగింది. చినతల్లిని పోలీస్ ఆఫీసర్ కలిసినప్పుడు ఉన్న బ్లౌజ్ తరువాత మారిపోతుంది.. పోలీస్ ఆఫీసర్ బయటకి వెళ్ళిపోయాక చినతల్లి కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఉండే బ్లౌజ్ డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది.
ఇంకా.. ఈ కేసు ని సాల్వ్ చేయడం కోసం లాయర్ చంద్రు బిఎస్ ఎన్ ఎల్ వారి సాయంతో కాల్ రికార్డులు తీసుకుంటాడు. నిజానికి ఈ స్టోరీ 1990 ల కాలం లో జరిగింది. అంటే అప్పటికి బి ఎస్ ఎన్ ఎల్ ఇంకా మొదలు కాలేదు. బిఎస్ ఎన్ ఎల్ కంపెనీ ప్రారంభం అయ్యింది 2000 ల సంవత్సరంలో. అంటే.. ఈ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కల్పితాలు. సినిమాటిక్ లిబర్టీ కోసం వాడుకున్నారు. నిజానికి ఇంత గొప్ప సినిమా ముందు ఈ మిస్టేక్స్ ఏమి అడ్డం రావు. కానీ.. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఓ సారి తెలుసుకుంటాం అంతే.. వాటిని ఈ కింద వీడియో లో చూసేయండి.
Watch Video:
End of Article