తమ్ముడి కోసమే బతుకుతూ ఉంటాడు… కానీ తమ్ముడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే..? ఈ సినిమా చూశారా..?

తమ్ముడి కోసమే బతుకుతూ ఉంటాడు… కానీ తమ్ముడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే..? ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకి మలయాళం సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు అని అంటూ ఉంటారు. మలయాళం సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. 2020 నుండి మలయాళం సినిమాలు తెలుగులో కూడా విడుదల అవ్వడం మొదలు అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో చాలా మంది మలయాళం కంటెంట్ చూశారు. దాంతో వాళ్లు ఎంత మంచి కంటెంట్ తీస్తున్నారు అని అందరూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు. మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళకి కూడా మలయాళం సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరొక ఆణిముత్యం ఈ సినిమా.

Video Advertisement

movie on a man and his sibling

ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమా పేరు ట్రాన్స్. అన్వర్ రషీద్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అన్వర్ రషీద్ నిర్మించిన ఈ సినిమాకి అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, విజ్జు ప్రసాద్ (ఫహద్ ఫాజిల్) ఒక మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తన ఇంట్లో అప్పుల బాధ వలన తన తల్లి తుది శ్వాస విడుస్తుంది. దాంతో అప్పటి నుండి తన తమ్ముడిని విజ్జు చూసుకుంటూ ఉంటాడు. విజ్జు తమ్ముడికి మానసికంగా సమస్య ఉండడంతో తన తమ్ముడిని బాగు చేసుకోవాలి అని విజ్జు అనుకుంటాడు. అయితే తన అన్న అంత కష్టపడటం ఇష్టం లేక విజ్జు తన ప్రాణాలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కూడా ఒక పాత్ర పోషించారు.

సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది. 2020 లో ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా మలయాళం లో విడుదల అయ్యింది. 2021 ఆగస్టు 7వ తేదీన ఆహాలో ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యింది. లాక్ డౌన్ లో ఈ సినిమా మలయాళం లో విడుదల అయిన కారణంగా ఆశించిన కలెక్షన్స్ రాలేదు. కానీ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన ఫిల్మోగ్రఫీలో మరొక గుర్తుంచుకునే పర్ఫార్మెన్స్ ని ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ చేశారు. మలయాళం సినిమాలు తెలుగు వాళ్ళు చూస్తున్న కొత్తల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఒకరకంగా చెప్పాలి అంటే పుష్ప కంటే ముందే ఫహద్ ఫాజిల్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత పుష్ప సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు.


End of Article

You may also like