సినిమా అంతా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?

సినిమా అంతా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

రీసెంట్ గా 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లను ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్ లలో ఉత్తమ తమిళ చిత్రంగా ‘క‌డ‌సీ వ్య‌వ‌సాయి’ అనే మూవీ ఎంపిక అయ్యింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి లీడ్ రోల్ లో నటించారు. అంతేకాకుండా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించారు.

Video Advertisement

ఈ చిత్రాన్ని దర్శకుడు ఎం.మ‌ణికంద‌న్ తెరకెక్కించాడు. వ్య‌వ‌సాయ రంగంలోని స‌మ‌స్య‌ల పై తెరకెక్కిన ఈ మూవీ  ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో తమిళంతో పాటు, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
విజ‌య్ సేతుప‌తి, నల్లంది, యోగీబాబు నటించిన క‌డ‌సీ వ్య‌వ‌సాయి మూవీ కథ విషయానికి వస్తే, ఇది వ్యవసాయాన్ని  నమ్ముకున్న ఒక రైతు కథ. అడ‌వికి సమీపంగా ఉన్న ఒక ప‌ల్లెటూరులో వ‌ర్షాలు లేక క‌రువు వస్తుంది. దాంతో రైతులు త‌మ భూముల్ని అమ్ముకుంటారు. కానీ మ‌ల్ల‌య్య(నల్లంది) అనే 85 ఏళ్ల వృద్దుడు తన తాత‌ముత్తాత‌ల నుంచి వస్తున్న భూమినే న‌మ్ముకుని జీవిస్తుంటాడు. మల్లయ్య త‌న భూమిని అమ్మ‌డానికి అంగీకరించడు. అయితే ఊరిలోని క‌రువు తొలగిపోవడానికి గ్రామ‌దేవ‌త‌కు జాత‌ర చేయాల‌ని ఊరివారు నిర్ణ‌యించుకుంటారు.
కానీ గ్రామ దేవ‌త‌కు వ‌రి పండించి, దానిని మొక్కుగా ఇవ్వాలి. మ‌ల్ల‌య్య పొలంలోని బావిలో మాత్రమే నీళ్లు ఉండడంతో ఊరివాళ్లంద‌రూ మల్లయ్య పొలంలో వారి పండించాలని అతన్ని ప్రాధేయ‌ప‌డ‌తారు. మ‌ల్ల‌య్య దానికి అంగీకరించి, త‌న పొలంలోనే వ‌రి పంటను వేస్తాడు. అయితే నెమ‌ళ్లు మ‌ల్ల‌య్య పొలంలో చ‌నిపోవ‌డంతో మల్లయ్యనే వాటిని చంపాడ‌ని కేసు పెడ‌తారు.జైలుకు వెళ్ళిన మల్లయ్య ఆ కేసు నుండి ఎలా బయటికి వచ్చాడు? పోలీసులు వ‌రి పంట బాధ్య‌త‌ను ఎందుకు తీసుకున్నారు? మల్లయ్యను ఊరి ప్రజలు ఎలా నిర్దోషిగా నిరూపించారు? మరణించిన మామా కుమార్తెను తలచుకుంటూ జీవిస్తున్న రామ‌య్య (విజ‌య్ సేతుప‌తి) ఎవరు? అన్న‌దే మిగిలిన కథ. విజ‌య్ సేతుప‌తి మూవీలో క‌నిపించేది కాసేపే అయినా త‌న న‌ట‌న‌తో ఆకట్టుకున్నాడు. యోగిబాబు చిన్న అతిథి పాత్రలో మెరిశాడు. మ‌ల్ల‌య్యతో పాటు నటించిన ప్ర‌ధాన పాత్రలలోని వారు సహజంగా నటించి, ఆకట్టుకున్నారు. క‌డ‌సీ వ్య‌వ‌సాయి మంచి సందేశంతో సాగే ఫీల్‌గుడ్ సినిమా. ఓపిక‌తో చూస్తే మంచి ఫీల్ క‌లుగుతుంది.


End of Article

You may also like