Ads
2021 సంవత్సరానికి గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కొంత కాలం క్రితం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ప్రకటించిన అవార్డుల విషయంలో పలు సినిమాలకు నిరాశ ఎదురయ్యింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సర్పట్టా, జై భీమ్ వంటి తమిళ సినిమాలకు జాతీయ అవార్డుల్లో చోటు దక్కకపోవడంతో పలువురు ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Video Advertisement
ఈ చిత్రాల వలె 2021 లో రిలీజ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న కన్నడ చిత్రానికి కూడా నిరాశే ఎదురయ్యింది. ఈ చిత్రం పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, సైమ అవార్డ్ లను అందుకుంది. మరి ఇలాంటి మూవీకి ఒక జాతీయ అవార్డు కూడా రాకపోవటం ఏంటి అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మూవీ ఏమిటో? స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
”గరుడ గమన వృషభ వాహన” మూవీ 2021లో నవంబర్ 19న రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించింది. ఈ కన్నడ మూవీ షోలు హైదరాబాద్ వంటి పలు నగరాల్లోనూ వేశారు. ఈ మూవీ పై అంత హైప్ ఏర్పడింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఈ చిత్రానికి రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యి, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇద్దరు మిత్రులు వారి శత్రువులను ఎదురించే క్రమంలో పెద్ద గ్యాంగ్ స్టర్స్ గా ఎదుగుతారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఎదురైన సమస్యలు, ఆ తరువాత వారి పతనానికి కారణం అయిన పరిస్థితుల ఏమిటనేది మిగిలిన కథ. రొటీన్ కథ అయినప్పటికీ కంప్లీట్ వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రాజ్ బి శెట్టి మరియు రిషబ్ శెట్టిలు అద్భుతంగా నటించారు. వారి నటనతో పాటు, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో హైలైట్. మంచి కలెక్షన్స్ తో పాటు, ‘గరుడ గమన వృషభ వాహన’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి జాతీయ అవార్డులలో గుర్తింపు దక్కలేదు. దాంతో ఇట్లాంటి సినిమాకి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవటం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “చిరంజీవి – త్రిష” లాగానే… తెరపై అస్సలు “సూట్ అవ్వని” 15 హీరో-హీరోయిన్ల కాంబినేషన్స్..!
End of Article