Ads
తెలుగు సినిమాలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన మేకర్స్ విడుదల చేస్తుంటే, డైరెక్టర్ హరీశ్ శంకర్ అక్కడి హిట్ చిత్రాలను టాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్లు అందుకుంటున్నారు. బాలీవుడ్ దబాంగ్ మూవీని ‘గబ్బర్ సింగ్’ గా తెలుగులో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. కోలీవుడ్ మూవీ జిగర్తాండను ‘గద్దల కొండ గణేష్’ తెలుగులో రీమేక్ చేసి హిట్ సాధించారు.
Video Advertisement
మరో బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయనున్నట్టు చాలా రోజుల క్రితం వార్తలు వినిపించాయి. దానిపై ఎవరు రెస్పాండ్ కాలేదు. అయితే తాజాగా హరీశ్ శంకర్ రవితేజతో సినిమాని ప్రకటించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ మూవీ ఆ బాలీవుడ్ మూవీ రీమేక్ అని టాక్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సినిమాను తాజాగా ప్రకటించారు. రవితేజ హరీష్ శంకర్‌కు డైరెక్టర్ గా ‘షాక్’ మూవీతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్‌కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీతోనే రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. 2018లో వచ్చిన రైడ్ మూవీలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒక విలేజ్ లో అక్రమాస్తులు, బ్లాక్ మనీ అన్యాయంగా సంపాదించి, దాచిపెట్టిన వ్యక్తి ఇంటి పైకి రైడింగ్ చేసే ఇన్ కమ్ టాక్స్ అధికారి కథనే ఈ మూవీ.కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీతో పోలికలు ఉంటాయి. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ రీమేక్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన ఈ మూడు సినిమాలను ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చూశారు. మళ్ళీ రీమేక్ చేయడానికి అంతగా ఏముందని అంటున్నారు.
Also Read: నైజాంలో సంక్రాంతి సినిమాల హడావిడి… డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే..?
End of Article