పార్ట్ 1 సూపర్ హిట్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది..! అసలు ఏం ఉంది ఇందులో..!

పార్ట్ 1 సూపర్ హిట్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది..! అసలు ఏం ఉంది ఇందులో..!

by kavitha

తెలుగు ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, వరుస చిత్రాలలో నటించిన ప్రియమణి పెళ్లైన కొత్తలో, యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలలో ప్రేక్షకులను అలరించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయి.

Video Advertisement

దాంతో ప్రియమణి విరామం తీసుకుంది. ఆ తరువాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి, రియాల్టీ షోలకు జడ్జీగా చేసింది.  ఆ తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి, భామా కలాపం మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ మూవీ హిట్ కావడంతో ఆమె మళ్ళీ  సినిమాలతో బిజీగా మారింది. భామా కలాపం 2 కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో భామా కలాపం మూవీ కథ ఏమిటో ఇప్పడు చూద్దాం..

తాజాగా రిలీజ్ అయిన భామా కలాపం 2 టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రియమణి లీడ్ రోల్ లో నటించగా సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ త‌దిత‌రులు ఇందులో న‌టించారు. అభిమన్యూ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ 2022 లో ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన మూవీ భామా కలాపంకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. భామా కలాపం ఓటీటీలో రిలీజ్ అయ్యి, ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక కథ విషయానికి వస్తే, అనుపమ(ప్రియమణి) అమాయకపు గృహిణి. ఆమె ఒక అపార్ట్‌మెంట్ లో భర్త మోహన్, కొడుకు వరుణ్‌తో కలిసి నివసిస్తుంటుంది. యూట్యూబ్‌లో సొంత కుకింగ్ ఛానెల్‌ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటలు చేస్తుంటుంది. అయితే ఆమెకు ఇతరుల ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడూ కిటికీలోంచి ఇతరులను గమనిస్తూ, అపార్ట్‌మెంట్ లో పనిచేసే పనిమనిషి శిల్ప నుండి వారి విషయాలను  తెలుసుకుంటూ ఉంటుంది.
కోల్‌కతా మ్యూజియంలో 200 కోట్ల రూపాయల విలువైన ఒక గుడ్డు అదృశ్యం అవుతుంది. ఆ గుడ్డు కారణంగా అనుపమ, ఆమె ఫ్యామిలీ ఎలాంటి సమస్యలలో చిక్కుకున్నారు ? ఇతరుల గురించి  తెలుసుకోవాలనుకునే అనుపమ ఆసక్తి వల్ల ఎలాంటి ప్రమాదం వచ్చింది? చివరకు దానిని నుంచి వారు ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ.


You may also like

Leave a Comment