ఇటీవల కాలంలో స్టార్‌ హీరోల పాత సినిమాలను రీరిలీజ్ చేయడం అనేది సాధారణం అయ్యింది. మొదట్లో విజయం  సాధించిన సినిమాలను రీరిలీజ్ చేయగా, ఆ తరువాత గతంలో ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు.

Video Advertisement

ఆ తరువాత సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ బీటెక్ వంటి డబ్బింగ్ సినిమాలను కూడా రీరిలీజ్ చేశారు. ఈ క్రమంలో లోక నాయకుడు కమల్‌ హాసన్ నటించిన పుష్పక విమానం మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. మరి ఆ మూవీ గొప్పదనం ఏమిటో? ఇప్పుడు చూద్దాం..
కొన్ని సినిమాలును థియేటర్‌లో మాత్రమే చూడాలి అనడం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాంటి మూవినే పుష్పక విమానం, ఈ మూవీ విడుదల అయ్యి 36 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తరువాత ఆ మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ పేజీని సృష్టించుకుంది. కమర్షియల్ హీరోలు సాధారణంగా ప్రయోగాలు చేయడానికి సాహసించరు. కానీ కమల్ హాసన్ ఎన్నో చిత్రాలలో ప్రయోగాలు చేశారు.
అలాంటి సినిమాలలో క్లాసిక్ మూవీ పుష్పక విమానం ఒకటి. ఇలాంటి మూవీ చూసే థియేటర్ లో చూసే అవకాశం నేటి తరం ప్రేక్షకులకు అందివ్వాలని ఈ సినిమాని రీరిలీజ్ చేయబోతున్నారట. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూకీ మూవీలో డైలాగ్స్ ఉండవు. సైగల ద్వారా మాత్రమే చిత్రంలోని క్యారెక్టర్స్ మాట్లాడుకుంటూ, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా స్టోరీ అర్థమయ్యే విధంగా గొప్పగా తెరకెక్కించారు. 1987లో ఈ మూవీ కన్నడ భాషలో రూపొందింది.
ఆ తరువాత తెలుగులో పుష్పక విమానం, తమిళంలో పేసుం పదం, హిందీలో పుష్పక్ గా విడుదల చేశారు. ఈ మూవీలో కమల్ హాసన్, అమల, ప్రతాప్ పోతన్, టిను ఆనంద్, పీఎల్ నారాయణ వంటి వారు అద్భుతమైన నటనతో కట్టిపడేసేలా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎల్ వైద్యనాథన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సైలెంట్ డ్రామాకు ప్రాణం పోశారు. కమర్షియల్ అంశాలు, మాస్ మాసాలా వంటివి లేకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. 35 లక్షల బడ్జెట్ తో మూవీ తీస్తే, కోటి రూపాయలు పైగా కలెక్ట్ చేసి, అప్పట్లో రికార్డు సృష్టించింది.

Also Read: థియేటర్ల‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జవాన్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?