2015 లోనే బాహుబలి సినిమాకి పోటీగా ఈ సినిమా తీశారు… కానీ రిజల్ట్..? ఈ సినిమా చూశారా..?

2015 లోనే బాహుబలి సినిమాకి పోటీగా ఈ సినిమా తీశారు… కానీ రిజల్ట్..? ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

కొన్ని క్లాసిక్ సినిమాలని ముట్టుకోకూడదు. ఇది మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ చెప్పే మాట. ఇది నిజమే. కొన్ని సినిమాలు ఉంటాయి. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. వాటిని రీమేక్ చేయాలని ప్రయత్నించినా, లేదా వాటిని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి సినిమాలు చేయాలని ప్రయత్నించినా కూడా అవి విఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాకి సీక్వెల్ తీయాలని కూడా ప్రయత్నించకూడదు. అలా వదిలేయాలి ఆ సినిమాలని. అంతే. బాహుబలి. భారతదేశం మొత్తాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు తిప్పుకునేలా చేసిన సినిమా ఇది. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే అందరికీ అంత పెద్ద మంచి అభిప్రాయం ఉండేది కాదు.

Video Advertisement

movie which made with baahubali inspiration

కానీ దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి, బాహుబలి ద బిగినింగ్ సినిమాతో, అందరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు బాహుబలి బృందం. దీనికి మూల స్తంభం ఎస్ఎస్ రాజమౌళి. ఆయన లాగా ఎవరు సినిమాలు తీయలేరు. ఎవరు ఆయన లాగా సినిమాలు తీయాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే, అలాంటి సినిమాలు తీయడం అందరికీ వచ్చిన పని కాదు. ఎవరి ప్రత్యేకత వారిది. రాజమౌళి ప్రత్యేకత ఇది. అయితే, 2015 లో బాహుబలి సినిమా వచ్చింది. 2015 జూలైలో బాహుబలి సినిమా విడుదల అయ్యింది. 2015 అక్టోబర్ లో బాహుబలిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన సినిమా మరొకటి విడుదల అయ్యింది.

ఈ సినిమాలో కూడా చాలా మంది పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు. టెక్నీషియన్స్ కూడా చాలా తెలిసిన వారే ఉన్నారు. దళపతి విజయ్ హీరోగా నటించిన పులి సినిమా కొంత మందికి గుర్తుండి ఉంటుంది. కొంత మందికి అంత పెద్దగా గుర్తు ఉండదు. ఎందుకంటే అంత పెద్ద గుర్తుపెట్టుకోదగ్గ సినిమా కాదు. చాలా సీరియస్ గా చేసిన కొన్ని సీన్స్ కూడా చాలా కామెడీగా అనిపిస్తాయి. శ్రీదేవి గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. యవ్వన రాణి అనే పాత్రలో శ్రీదేవి నటించారు. కిచ్చా సుదీప్ నెగిటివ్ పాత్రలో నటించారు. ప్రభు మరొక ముఖ్య పాత్రలో నటించారు.

శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. చాలా హై బడ్జెట్ తో రూపొందించిన సినిమా. గ్రాఫిక్స్. గ్రాండ్ గా ఉన్న విజువల్స్. కానీ ఇవేవీ సినిమాని కాపాడలేకపోయాయి. చింబుదేవన్ అందించిన కథ, తెరకెక్కించిన విధానం ఆకట్టుకోలేకపోయాయి. ఇందులో ముఖ్యంగా ఒక సీన్ ఉంటుంది. విజయ్ లెన్స్ పెట్టుకోవడానికి ఒక రకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. దీన్ని చూసినవారు అప్పట్లో కన్ఫ్యూజ్ అయ్యారు. ఇలాంటి చాలా సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఒక సోషియో ఫాంటసీగా ఈ సినిమాని రూపొందించాలి అని అనుకున్నారు. కానీ అనుకున్న విజయం సాధించలేకపోయారు.


End of Article

You may also like