Ads
సినిమాలని పోలిన సినిమాలు రావడం అనేది సహజం. చాలా సినిమాల్లో ఆ సినిమా స్టోరీ పాయింట్ మరొక సినిమా స్టోరీ పాయింట్ కి దగ్గరగా ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం అలా ఉన్నప్పుడు రీమేక్ అని చెప్పి చేస్తారు. మరికొన్ని ఫ్రీమేక్ అవుతాయి.
Video Advertisement
అంతే కాకుండా అదే భాషలో రూపొందిన ఒక పాత సినిమాని ఈ తరానికి తగ్గట్టు మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలా ఇప్పుడు కూడా ఒక సినిమా వస్తోంది అని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే దాదాపు 38 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా నటించిన ఒరు కైధియిన్ డైరీ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకి భారతీరాజా దర్శకత్వం వహించగా భాగ్యరాజ్ స్టోరీ ఇచ్చారు. 22 సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదల అయిన డేవిడ్ అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతని కొడుకు జేమ్స్ అలియాస్ శంకర్ కి డేవిడ్ తో ఎలాంటి గొడవలు ఉన్నాయి అనే పాయింట్ చుట్టూ సినిమా ఉంటుంది.
ఈ సినిమాని తెలుగులో ఖైదీ వేట పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇటీవల విడుదల అయిన ఒక సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో పోలుస్తున్నారు. ఇందులో హీరో కూడా తండ్రి కొడుకులు గా నటిస్తున్నారు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆ హీరో పెద్ద హీరో కావడంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈపాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది.
అదే సినిమా. జవాన్ సినిమా ట్రైలర్ దాదాపు ఇలాగే ఉంది. సినిమా కథ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సాధారణంగా అట్లీ సినిమాలు పాత తమిళ్, తెలుగు సినిమాలని కలిపి తీసినట్టు ఉంటాయి అని ఎప్పటినుండో కామెంట్ అయితే ఉంది. కానీ టేకింగ్ చాలా బాగుండడంతో అట్లీ సినిమాలకి ఒక స్పెషల్ మార్క్ ఉంది.
మరి ఇప్పుడు ఈ సినిమా కథ కూడా రొటీన్ కథ అయినా కూడా టేకింగ్ బాగుంటే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ కి ఇంకా కొద్ది రోజులే ఉండడంతో ఇప్పుడు ఖైదీ వేట సినిమాతో ఈ సినిమాని పోల్చడం అనేది చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ లో చూపించిన సీన్స్ కూడా దాదాపు అలాగే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : “అతడు” తర్వాత “మురళీ మోహన్” సినిమాలు ఆపేయడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?
End of Article