“అతడు” తర్వాత “మురళీ మోహన్” సినిమాలు ఆపేయడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?

“అతడు” తర్వాత “మురళీ మోహన్” సినిమాలు ఆపేయడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాకు తెలుగు చిత్రాలలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ నిర్మాతగా జయభేరి బ్యానర్ పై  నిర్మించిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Video Advertisement

ఈ మూవీ స్టార్ మా ఛానెల్ లో ఇప్పటివరకు 1350 సార్లు ప్రసారం అయిన మూవీగా అరుదైన రికార్డ్ ను నెలకొల్పింది.  టీవిలో ప్రసారమైన ప్రతిసారి అతడు సినిమా మంచి రేటింగ్స్ ను తెచ్చుకుంది. అలాంటి మూవీని నిర్మించిన తరువాత మురళీ మోహన్ సినిమాలను నిర్మించడం ఆపేశారు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన సినిమా అతడు. ఈ మూవీ థియేటర్లలో కన్నా బుల్లితెర పై ఎక్కువ విజయాన్ని సాధించింది. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ పై పెట్టిన పెట్టుబడి కన్నా, ఊహించని స్థాయిలో ఆదాయం  వచ్చిందని ఇండస్ట్రీ లో టాక్. ఇటీవలే ఈ మూవీ వెయ్యి సార్లు కన్నా ఎక్కువగా ప్రసారం అయిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీని సీనియర్ నటుడు మురళీ మోహన్ తన సొంత బ్యానర్ అయిన జయభేరి ప్రొడక్షన్స్ పైన నిర్మించారు. ముర‌ళీ మోహ‌న్ న‌టుడు మాత్రమే కాదు. నిర్మాత, వ్యాపార వేత్త‌ కూడా విజయం సాధించాడు. నటుడుగా సినిమాల‌లో ఆర్జించిన డ‌బ్బును రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టి విజయం సాధించారు. జయభేరి అనే నిర్మాణ సంస్థ స్థాపించి పలు సినిమాలను నిర్మించాడు. కానీ అత‌డు మూవీ త‌ర‌వాత మళ్ళీ ముర‌ళీ మోహ‌న్ చిత్రాలను నిర్మించ‌లేదు. ముర‌ళీ మోహ‌న్ అతడు మూవీ తరువాత సినిమాలను ఆపడానికి గ‌ల కార‌ణాల‌ను ఒక ఇంట‌ర్వ్యూలో వివరించారు.
అత‌డు మూవీ స‌మ‌యంలో రాజ‌కీయంగా తాను బిజీగా మారిపోయానని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. ఒక మూవీని నిర్మించేట‌ప్పుడు సెట్ లో నిర్మాత ఉండి, అన్నింటినీ ద‌గ్గ‌రుండి చూసుకోవాల‌ని, మేనేజర్లను నమ్ముకోకూడదని అన్నారు. అందుబాటులో ఉండలేని కారణం వల్లనే ఆ మూవీ తర్వాత జయభేరి బ్యానర్ లో మరే సినిమాలు నిర్మించలేదని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. మళ్ళీ తన బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

Also Read: సినిమా అంతా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like