Ads
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించాయి. ఈ విజయాలు దేశమంతా కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాయి. శాండల్ వుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి విజయం సాధిస్తున్నాయి.
Video Advertisement
కన్నడ చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ యాక్టర్ రాజ్ బి శెట్టి నటించిన టోబి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హిట్ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..నటుడు రాజ్ బి. శెట్టి కన్నడ చిత్రసీమలో ఓ ట్రెండ్ ను సృష్టించారు. ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించారు. శెట్టి నటుడు మాత్రమే కాదు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఆయన నటించే చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. యుక్ మొత్తే కతి, గరుడ గమన వృషభ వాహన చిత్రాలలో విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలకి మంచి స్నేహితుడు. ఈ ముగ్గురి నుండి సినిమా వస్తుందంటే కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ ఏడాది రాజ్ బి. శెట్టి మరొక డిఫరెంట్ మూవీ ‘టోబి’ తో ఆడియెన్స్ ని పలకరించారు. టోబి మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లీవ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, టోబీ ఒక విడిచిపెట్టిన పిల్లవాడు. చిన్నతనంలో అనేక వేధింపులకు గురి అవుతాడు. అతనికి పేరు కూడా లేదు. ఆ పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చినవారు టోబీ అని పిలుస్తారు.
టోబీ కోపం ఎక్కువగా ఉంటుంది. అతనికి కోపం వచ్చినపుడు చంపేస్తాడు. టోబీతో పాటు అతని కోపం కూడా పెరుగుతుంది. విపరీతమైన కోపం వల్ల అతను పాపులర్ అవుతాడు. అతనికి నచ్చినవారు చెబితేనే ఏదైనా వింటాడు. అయితే కొందరు వ్యక్తిని కొందరు టోబీని స్వార్ధం కోసం వాడుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న టోబీ ఏం చేశాడు? వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
Also Read: “యనిమాల్” లో హీరో ఎంట్రీ సీన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం వీరేనా..?
End of Article