సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..! ఈ సినిమా చూశారా..?

సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

ఓనం పండుగ సందర్భంగా కేరళలో పెద్ద సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈసారి దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త, ప్రేమమ్ హీరో నివీన్ పోలి నటించిన రామచంద్ర బాస్ అండ్ కో వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి, నెగటివ్ టాక్ తెచ్చుకున్నాయి.

Video Advertisement

అయితే వీటితో పాటు రిలీజ్ అయిన ‘ఆర్డిఎక్స్: రాబర్ట్ డోని గ్సేవియర్’ కి కూడా తొలిరోజు తొలి షో ప్రేక్షకులు లేక థియేటర్లు వెల వెల పోయాయి. కానీ ఆ తరువాత షోలకి ఊహించని విధంగా హౌస్ ఫుల్ అయ్యాయి. మరి ఆ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
టైటిల్ లో సూచించిన విధంగా ఈ మూవీ ముగ్గురు యువకుల కథ. రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోనీ వర్గీస్) ఇద్దరు అన్నదమ్ములు, వీరి స్నేహితుడు జేవియర్ (నీరజ్ మాధవ్) తో కలిసి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతారు. చర్చిలో జరుగిన పండుగలో తన తండ్రి పై చేయి వేశారని డోని రౌడీ గ్యాంగ్ ను చితకబాదుతాడు. ఆ రౌడీ గ్యాంగ్ అర్ధరాత్రి సమయంలో డోని ఇంటి పైకి వచ్చి కుటుంబంలో చిన్న పిల్లలతో పాటు అందరి పై దాడి చేస్తారు. వారికి తీవ్రమైన గాయాలు అవుతాయి.
డోని ఇంటి పై దాడి చేసిన గ్యాంగ్ ఎవరిది? ఆ గ్యాంగ్ కి డోని కుటుంబం పై ఉన్న పగ ఏమిటి? దాడి చేసిన తరువాత ఆ గ్యాంగ్ పై డోని, రాబర్ట్, జేవియర్ ఎలా పగ తీర్చుకున్నారు అనేది మిగిలిన కథ. డైనమిక్ ఫైట్ సీక్వెన్స్‌లు, హై-స్టేక్స్ స్టంట్స్, టెన్షన్-ఫిల్డ్ మూమెంట్స్ తో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్, కామెడీ వంటివన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్ మరియు నీరజ్ మాధవ్ ముగ్గురు ఎక్కడా తగ్గకుండా పోటీ పడి నటించారు. విష్ణు అగస్త్య విలన్ పాత్రలో నటించాడు. విలన్ గా ఆయన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను సైతం భయపెట్టాయి. ఈ మూవీకి యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి.

Also Read: OG కొత్త పోస్ట‌ర్‌లో… “ప‌వ‌న్ క‌ళ్యాణ్” చేతికి ఉన్న‌ టాటూ అర్థం ఏంటో తెలుసా..?


End of Article

You may also like