Ads
సమస్యలకు లింగభేదం ఉండదు. అయితే సమస్యలను ఎదుర్కొనే ధోరణి మాత్రం అందరిలో ఒకేలా ఉండదు. మన సమాజంలో ఆడవాళ్లు, మగవాళ్లకు వేర్వేరు రకాల సమస్యలు ఎదురవుతాయనే మైండ్ సెట్ ముందు నుంచి ఉంది. కానీ అది తప్పు. ఆ సమస్యలు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.
Video Advertisement
సాధారణంగా మగవాళ్లు ఫైనాన్షియల్, వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎదుర్కొంటారు. కుటుంబ అవసరాలను తీర్చాలని, ఆర్థిక పరంగా అన్ని అంశాలను నెరవేర్చాలనే భావన వారికి ఉంటుంది. అనుకున్న విధంగా పనులు జరిగే సూచనలు కనిపించని సమయంలో ఒత్తిడికి గురవుతారు. తమ మానసిక సమస్యలను ఇతరులతో చర్చించడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇలా తమలోని ఆలోచనలు దాచుకోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది.
ఇప్పుడు మగవాళ్ల సమస్యలను ప్రపంచానికి చూపించిన సినిమాలేంటో చూద్దాం..
#1 బడ్జెట్ పద్మనాభం
తన ఫామిలీ ని బాగా చూసుకోవాలని డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టే వ్యక్తి అందరి ముందు పిసినారిలాగా మిగిలిపోతాడు. ఈ క్రమం లో అతడు పడే ఇబ్బందులను ఫన్నీ గా చూపించాడు దర్శకుడు.
#2 నేను
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన నేను చిత్రం లో ఒక వన్ సైడ్ లవర్ గురించి చూపించారు. అతను సైకో లా మారడం ఇంకో కోణం కానీ మెయిన్ పాయింట్ ఈస్ వన్ సైడ్ లవ్.
#3 రఘువరన్ బి.టెక్
బి. టెక్ పూర్తయిన తర్వాత నచ్చిన జాబ్ రాక.. నచ్చని జాబ్ చేయలేక ఒక అబ్బాయి పడే ఇబ్బందులను ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు.
#4 వినాయకుడు, లడ్డు బాబు
ఒక అబ్బాయి లావుగా ఉంటే అతడు ఎదుర్కొనే బాడీ షేమింగ్, పెళ్లి కావడానికి అతడు పడే ఇబ్బందులను ఈ రెండు చిత్రాల్లో చూపించారు. ఇది అమ్మాయిలకు కూడా ఎదురయ్యే సమస్యే.
#5 సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
ఈ చిత్రం లో ఒక అబ్బాయి లవ్ లైఫ్ లో జరిగే అన్ని విషయాలను స్పష్టం గా చూపించారు.
#6 మజిలీ, జెర్సీ
పెళ్లి అయ్యాక కూడా జాబ్ లేకుండా.. వైఫ్ జాబ్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి పడే ఇబ్బందులు, సూటి పోటీ మాటలు ఈ రెండు సినిమాల్లో చూపించారు.
#7 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
స్టడీస్ పూర్తి అయ్యాక జాబ్ రాక ముందు వరకు పేరెంట్స్ దగ్గర ప్రతి అవసరానికి డబ్బులు అడగాలి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ మూవీ లో చూపించారు.
#8 మల్లీశ్వరి
అబ్బాయికి 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకపోతే కనిపించిన ప్రతివారు అడిగే ప్రశ్న.. బాబు పెళ్ళెప్పుడు అనే..పెళ్లి అయ్యే వరకు వారి పరిస్థితి ‘పెళ్లి కాని ప్రసాదు’ లానే ఉంటుంది.
#9 నూటొక్కజిల్లాల అందగాడు
బట్టతల కారణంగా ఒక అబ్బాయి మానసికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు. ఎలాంటి అభద్రతా భావానికి గురవుతాడు అన్న విషయాలను ఈ సినిమాలో చూపించారు.
End of Article