SP బాలసుబ్రహ్మణ్యం “మ్యూజిక్ డైరెక్టర్” గా చేసిన… ఈ 15 సినిమాలు ఏవో తెలుసా..?

SP బాలసుబ్రహ్మణ్యం “మ్యూజిక్ డైరెక్టర్” గా చేసిన… ఈ 15 సినిమాలు ఏవో తెలుసా..?

by Anudeep

Ads

సంగీత ప్రపంచంలో పాటల రారాజు గా వెలుగొందుతూనే…. బాల సుబ్రమణ్యం స్వర కర్తగానూ కొన్ని మైలురాళ్ళను నెలకొల్పారు. ఏ గాయకుడికి దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశానికి బాలు తనదైన ప్రతిభతో కొత్త సొగసులు అద్దారు. బాలు సంగీత స్వర ప్రయాణంలో అరుదైన పాటలు వేలల్లోనే ఉన్నాయి.

Video Advertisement

గాయకుడిగానే కాకుండా స్వరకర్తగా బాలు గౌరవ ప్రదమైన ప్రయాణం చేసారు. గాయకుడుగా 40 వేల పాటలకు ప్రాణం పోసిన బాలు, 50 చిత్రాలకు పైగా సంగీతం అందించారు. సంగీతం లోని అణువణువునూ తనలో నింపుకున్న ఈ అమర గాయకుడి స్వర ప్రయాణంలోని కొన్ని మధుర గీతాలను ఇప్పుడు చూద్దాం..

SPB is not a singer.. look how many movies he has composed music too..

#1 కన్యాకుమారి

కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో, ప్రయోగాలకు ముందుండంలో దిట్ట అయిన దాసరి నారాయణరావు గారి చొరవతో బాల సుబ్రమణ్యం స్వరకర్తగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కన్యాకుమారి. నరసింహారాజు, శ్రీవిద్య జంటగా నటించిన ఈ చిత్రం లోని పాటలు ఆదరణ పోందాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలకు సంగీతం అందించారు బాల సుబ్రమణ్యం

#2 ఊరంతా సంక్రాంతి

అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ క్రిష్ణ కాంబినేషనలోని మూవీ ఊరంతా సంక్రాంతికి బాలు అందించిన స్వరాలు ఆ సినిమా మూడ్ ని మరింత ఎలివేట్ చేసి నిజంగానే టైటిల్ కి తగ్గట్టు పండగలాంటి పాటలతో హుషారెత్తించారు బాలు. ఆ సినిమా విజయంలో బాలు ముద్ర స్పష్టంగా కనిపించింది.

#3 తూర్పు వెళ్లే రైలు
బాలు స్వర కర్తగా తన దారిని తాను వేసుకోవడం మొదలు పెట్టారు. దానికి అత్యంత ప్రతిభావంతుడైన బాపు అండదండలు దొరకడంతో ఆ ప్రయాణం మరింత కొత్త గా మారింది. వీరి ప్రయాణం తూర్పు వేళ్ళే రైలు తో మొదలయ్యింది.

https://www.youtube.com/watch?v=K8RkWGM8iZw

#4 సీతమ్మ పెళ్లి
బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మోహన్ బాబు, మురళి మోహన్, రేవతి, అరుణ ప్రధాన పాత్రల్లో నటించగా బాబు సంగీతాన్ని అందించారు.

#5 జాకీ

శోభన్ బాబు, సుహాసిని, రాధికా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా బాపు దర్శకత్వం వహించారు.

#6 భార్యామణి

శోభన్ బాబు, జయ సుధ, నూతన్ ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకుడు కాగా బాలు సంగీతం అందించారు.

#7 కొంగుముడి

శోభన్ బాబు, సుహాసిని జంటగా విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రానికి బాలు స్వరాలందించారు.

#8 దొంగల్లో దొర

విజయ బాపినీడు దర్శకత్వంలో సుమన్, విజయ శాంతి జంటగా నటించిన ‘దొంగల్లో దొర’ చిత్రానికి కూడా బాల సుబ్రమణ్యమే సంగీతం అందించారు. మాస్ అప్పీల్ తో వచ్చిన ఈ చిత్రానికి బాలు పాటలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

#9 ముద్దుల మనవరాలు

బాలు పాటలు.. జంధ్యాల మాటలు తెలుగు తెరంతా పరుచుకుంటున్న టైం లో వీరిద్దరూ కలిసి కొన్ని పాటలకు పురుడు పోసారు. అలా మాట, పాటగా మారిన వీళ్లిద్దరు దర్శకులు, సంగీత దర్శకులుగా అయిదు సినిమాలకి పనిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే జంధ్యాల సినిమాలకే బాలు ఎక్కువగా సంగీతం అందించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మొదటి ఆల్బమ్ ‘ముద్దుల మనవరాలు’. ఈ చిత్రంలో భానుమతి, సుహాసిని అమ్మమ్మ మనవరాలిగా నటించారు.

#10 పడమటి సంధ్యారాగం

సాంప్రదాయాలు.. ఎల్లలు .. వీటిని గెలిచిన ప్రేమ ఎలా ఉంటుంది.. అనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా పడమటి సంధ్యారాగం. ఆ సినిమా అప్పట్లో వస్తున్న సినిమాలలో పూర్తి భిన్నమైనది. విజయశాంతికి జంటగా ఒక అమెరికన్ నటుడు థామస్ జాన్ నటించిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ అనుకోవచ్చు. ఆ సినిమాలో ని ఈ తూరుపు ఆ పడమర సాగిన సంగమమే…అనే పాట హాద్దులు లేని ప్రేమకు స్వర నీరాజనం చేసింది. ఆ సినిమాకు స్వరాలందించిన బాలుకు, సినిమా కు ఎంత పేరు వచ్చిందో ఆయన పాటలకు అంతే పేరు వచ్చింది.

#11 వివాహభోజనంబు

జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘వివాహభోజనంబు, నీకూ నాకూ పెళ్లంట’ సినిమాలకు కూడా బాలు సంగీతం అందించారు. రాజేంద్రప్రసాద్, అశ్విని జంటగా నటించిన ‘వివాహభోజనంబు’ సినిమాలో కామెడీ ట్రాక్స్ కి ఎంత రెస్పాన్స్ వచ్చాయో ఎస్పీబీ చేసిన సంగీతానికి అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

https://www.youtube.com/watch?v=FHBv9oR0C5Y

#12 మగధీరుడు

విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, జయసుధ జంటగా నటించిన ‘మగధీరుడు’సినిమాకి బాలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. పుల్ లెంగ్త్ ఫ్యామిలీ సెంటెమెంట్ తో నడిచే ఈ సినిమాతో చిరంజీవి ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు.. బాలు స్వరాలు ఈ సినిమా కి పెద్ద అసెట్ గా మారాయి.

#13 రాము

రామానాయుడు స్టూడియోస్ లో బాలక్రిష్ణ, రజినీ జంటగా నటించిన ‘రాము’ సినిమాకి కూడా బాలసుబ్రమణ్యం మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. రాము సినిమా బాల కృష్ణ స్టార్ డమ్ ని కొనసాగించింది. బాలు గాయకుడిగా చాలా బిజీ గా ఉండే సమయం అది. అయినా రామానాయుడు కోరిక మేరకు ఆయన ఆసినిమాకు స్వరకర్తగా మారారు.. ఆ సినిమాలో యూత్, మాస్ ఆకట్టుకునే స్వరాలతో బాలు చేసిన మ్యాజిక్ తెరమీద విజల్స్ వేయించింది..

#14 జైత్రయాత్ర

ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన ‘జైత్రయాత్ర’కి సంగీతం అందించారు బాలు. కమర్షియల్ గా ఆ మూవీ విజయం సాధించకపోయినా బాలు స్వర పరిచిన ఎన్నాళ్ళమ్మ ఏన్నేళ్ళమ్మా ఈ చీకిటి పాటకు చాలా మంచి పేరు వచ్చింది.. ఆ పాట ఇప్పటికీ తెలుగు హిట్ సాంగ్స్ లో ఉంటుంది.

#15 మయూరి

ప్రమాదంలో కాలు కోల్పోయినా అధైర్య పడకుండా ఇష్టమైన డాన్స్ ని కంటిన్యూ చేసిన సుధా రామచంద్రన్ కథాంశంతో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమా ‘మయూరి’. ఉషాకిరణ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం సంగీతం అందించారు.

 

బాలసుబ్రమణ్యం మొత్తంగా 50 సినిమాల వరకు సంగీతం అందించారు. తెలుగులో 30 సినిమాలు, కన్నడలో 9 చిత్రాలు, తమిళ్లో 5, హిందీలో 2 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు బాలు.

SPB is not a singer.. look how many movies he has composed music too..

అయితే ఒక 15 ఏళ్ల వరకు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన బాలసుబ్రమణ్యం తొంభైల్లో సంగీతం నుంచి బ్రేక్ తీసుకున్నారు. సింగింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గాయకుడిగా శిఖరాగ్ర ఖ్యాతిని అధిష్టించిన బాలు స్వర కర్త గా కూడా గౌరవాన్ని పొందారు.


End of Article

You may also like