“రంగమార్తాండ” తో పాటు… “కమెడియన్స్” కూడా సీరియస్ పాత్రలు చేసిన 6 సినిమాలు..!

“రంగమార్తాండ” తో పాటు… “కమెడియన్స్” కూడా సీరియస్ పాత్రలు చేసిన 6 సినిమాలు..!

by kavitha

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో కామెడియన్స్ ఉన్నారు. వారు తమ హస్యంతో ఆడియెన్స్ ను అలరిస్తుంటారు. కామెడీ ప్రధానంగా వచ్చిన సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. కామెడీ సీన్స్ లేకుండా ఉన్న సినిమాలు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు.

Video Advertisement

బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, సునీల్ వంటి కమెడియన్స్ తమ పాత్రల ద్వారా, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటులు కొందరు సీరియస్ పాత్రలలో నటించి, తమ నటనతో ఆడియెన్స్ ను ఏడిపించారు. వారెవరో? ఏ సినిమాలలో సీరియస్ పాత్రలు చేశారో ఇప్పుడు చూద్దాం..
comedians-serious-roles 1. బ్రహ్మానందం – రంగమార్తాండ: 

కెరీర్ మొదటి నుండి కమెడియన్ గా అలరించిన బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఏడిపించారు. ఆయన ఇప్పటివరకు దాదాపు  1250కి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
2. ఎల్ బి శ్రీరామ్ – అమ్మో ఒకటో తారీఖు:

ప్రముఖ రచయిత నటుడు అయిన ఎల్ బి శ్రీరామ్ తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలలో నటించి అలరించారు. అయితే ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన అమ్మో ఒకటో తారీఖు సినిమాలో మధ్యతరగతి తండ్రిగా సీరియస్ పాత్రలో నటించారు.
3. రఘుబాబు- మురారి:

నటుడు రఘుబాబు కెరీర్ మొదట్లో విలన్ గా , ఆ తరువాత కామెడీ పాత్రలలో నటిస్తూ పాపులర్ అయ్యాడు. రఘుబాబు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమాలో సీరియస్ రోల్ లో నటించాడు.

4. సునీల్ – మాస్: 

కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత హీరోగా మారారు. సునీల్ తన కామెడీ టైమింగ్ తో పాపులర్ అయ్యాడు. నాగార్జున నటించిన మాస్ లో మూవీని మలుపు తిప్పే పాత్రలో నటించాడు.
5.  వెన్నెల కిషోర్ – గూడాచారి:

కమెడియన్ సునీల్ తరువాత అంత పాపులర్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. వెన్నెల సినిమాతో నటుడుగా మారిన ఆయన గుడాచారి మూవీలో సీరియస్ పాత్రలో నటించారు.
6. వేణు మాధవ్ – అన్నవరం: 

కమెడియన్ వేణుమాధవ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా మారారు. ఆయన పవన్ కళ్యాణ్ నటించిన  అన్నవరం మూవీలో పవన్ ఫ్రెండ్ గా నటించారు.
Also Read: “అల్లు అర్జున్ – త్రివిక్రమ్” సినిమా కథ ఇదేనా..? ఈసారి ఇలా ఆలోచించారా..?

 


End of Article

You may also like