“గంగోత్రి” తో పాటు… బలగం హీరోయిన్ “కావ్య కళ్యాణ్ రామ్” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన 9 సినిమాలు..!

“గంగోత్రి” తో పాటు… బలగం హీరోయిన్ “కావ్య కళ్యాణ్ రామ్” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన 9 సినిమాలు..!

by kavitha

Ads

బలగం చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటినటులందరికి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలో సంధ్యగా ఆడియెన్స్ కి గుర్తుండిపోయేలా నటించింది.

Video Advertisement

ఆమె నటించిన ‘ఉస్తాద్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదిలా ఉండగా కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా పలు చిత్రాలలో నటించారు. అల్లు అర్జున్ ‘గంగోత్రి’ మూవీలో ‘వల్లంకి పిట్ట’ పాటలో ఉన్న బాలనటి ఆమెనే. అయితే కావ్య బాలనటిగా చేసిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.  స్నేహమంటే ఇదేరా :
అక్కినేని నాగార్జున, సుమంత్ కలిసి నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా. ఈ చిత్రంలో కావ్య బాల నటిగా చేసింది.
2.  బాలు :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రేయ జంటగా నటించిన చిత్రంలో  శ్రేయ  మేనకోడలిగా కావ్య నటించింది.
3. ఠాగూర్ :
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో కావ్య బాల నటిగా చేసింది.
4. గంగోత్రి :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గంగోత్రి’. ఈ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ గా నటించింది.
5. అడవి రాముడు :
యంగ్ రెబల్ ప్రభాస్,ఆర్తి అగర్వాల్ జంటగా తెరకెక్కిన అడవి రాముడు సినిమాలో కావ్య హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది.
6. విజయేంద్ర వర్మ:
నందమూరి బాలకృష్ణ, లయ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కావ్య లయ కుమార్తెగా నటించింది.
7. బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గౌరి ముంజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘బన్నీ’ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో కావ్య నటించింది.
8. సుభాష్ చంద్రబోస్ :
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమాలో  చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించింది.
9. పాండురంగడు :
రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన పాండురంగడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించింది.

https://www.instagram.com/p/CUpcEx7JR3q/

Also Read: AGENT REVIEW : “అఖిల్ అక్కినేని” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like