Ads
హాలీవుడ్ చిత్రాలతో రాబిన్ హుడ్ పేరు ఎంతగానో పాపులర్ అయింది. ఇక అలాంటి స్టోరీనే త్వరలో తెలుగులో రాబోతుంది. అదే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఇది ఆంధ్రా రాబిన్ వుడ్ గా పేరు గాంచిన గరిక నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావు కథ.
Video Advertisement
స్టువర్టుపురం ఊరు బాపట్లకు దగ్గరలో ఉంటుంది. బ్రిటిష్ పాలనలో మదరాసు ప్రెసిడెన్సీ మెంబెర్ హెరాల్డ్ స్టువర్ట్ పునరావాసం కలిగించి దొంగల్లో మార్పు తెచ్చే ఉద్దేశంతో వాళ్ళందరిని ఈ ప్రాంతానికి తరలించేవారు. సంస్కరణకు పూనుకున్నాడు కాబట్టి స్టువర్ట్ పేరే ఆ గ్రామానికి పెట్టేశారు. ఎక్కడ చోరీలు జరిగినా పోలీసులు అక్కడికెళ్లి ఆరా తీసేవారు.
అయితే స్వాతంత్రం వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత 1970 నుంచి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని పోలీసులను వణికించాడు. ఇతను బాగా డబ్బున్న వాళ్ళను దోచి పేదలకు పంచేవాడని చెబుతారు. నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ దొంగతనాలు చేయడంలో బాగా పేరు పొందాడు. ఈ దొంగతనాలలో 1973లో బనగానపల్లిలో జరిగిన దొంగతనం అప్పట్లో సంచలనం అయ్యింది.
నాగేశ్వరరావు పధ్నాలుగు కిలోల బంగారంతో పాటు యాభై వేలకు పైగా డబ్బును తీసుకెళ్లిపోయాడని రికార్డులో ఉంది. ఇక ఆ తర్వాత 1980లో జరిగిన పోలీసుల కాల్పుల్లో టైగర్ నాగేశ్వరరావు చనిపోయాడు. మరణించే సమయానికి టైగర్ నాగేశ్వరరావు వయసు 27 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో బయోపిక్ తీస్తున్నారు.
ఇప్పుడు స్టువర్ట్ పురం నేపథ్యం లో వచ్చిన చిత్రాలేవో చూద్దాం..
#1 స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
1991 లో చిరంజీవి హీరోగా.. యండమూరి దర్శకత్వం లో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిత్రం తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
#2 స్టువర్ట్ పురం దొంగలు
1991 లోనే భానుచందర్, దగ్గుబాటి రాజా ప్రధాన పాత్రలో సాగర్ డైరెక్షన్ లో స్టువర్ట్ పురం దొంగలు వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
#3 స్టువర్ట్ పురం
2019 లో సత్యనారాయణ ఏకారి స్టువర్ట్ పురం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం లో ప్రీతి సింగ్, భాను ప్రసాద్, హర్ష నల్లబెల్లి ప్రధాన పాత్రల్లో నటించారు.
#4 స్టువర్ట్ పురం దొంగ
స్టువర్ట్ పురం నాగేశ్వరరావు కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్‌పురం దొంగ’ బయోపిక్ ప్రకటన ఎప్పుడో వచ్చింది. అయితే ఈ చిత్రం ఆగిపోయిందని సమాచారం.
#5 టైగర్ నాగేశ్వరరావు
ఇక రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ రాబోతోంది.
End of Article