“ప్రేమలు” సినిమా లాగానే… క్లైమాక్స్/ప్రీ-క్లైమాక్స్ “ఎయిర్‌పోర్ట్” లో తీసిన 7 సినిమాలు..!

“ప్రేమలు” సినిమా లాగానే… క్లైమాక్స్/ప్రీ-క్లైమాక్స్ “ఎయిర్‌పోర్ట్” లో తీసిన 7 సినిమాలు..!

by Harika

Ads

ఇటీవల రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి ప్రేమలు. మలయాళం నుండి డబ్బింగ్ చేసి విడుదల అయిన సినిమా అయినా కూడా, తెలుగు సినిమాకి లభించిన అంత ఆదరణ ఈ సినిమాకి లభించింది. సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ కొత్తవాళ్లు. అందరూ కూడా చాలా బాగా నటించారు. అయితే ఈ సినిమా చివరిలో హీరోయిన్ హీరోని ఎయిర్‌పోర్ట్ లో దింపేసి వచ్చేస్తూ ఉంటుంది. ఈ సీన్ చూసిన వాళ్లు అందరూ కూడా చాలా బాగుంది అని అన్నారు. అలా గతంలో కూడా ఎయిర్‌పోర్ట్ లో క్లైమాక్స్, లేదా ప్రీ క్లైమాక్స్ డిజైన్ చేసిన సినిమాలు ఉన్నాయి. అవేవో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

శర్వానంద్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ అంతా కూడా ఎయిర్‌పోర్ట్ లోనే నడుస్తుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

movies picturized in airport

#2 తొలిప్రేమ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ సీన్ గురించి అందరికీ తెలిసిందే.

#3 ఒక్కడు

మహేష్ బాబు, భూమిక నటించిన ఒక్కడు సినిమాలో ఎయిర్‌పోర్ట్ లో జరిగే సీన్ కూడా చాలా మందికి గుర్తుండిపోతుంది.

telugu okkadu tamil okkadu which hero did best performance

#4 ప్రేమలు

ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సీన్స్ లో ఒకటిగా నిలిచింది.

premalu movie review

#5 ప్రేమతో రా

ఈ సినిమాలో కూడా హీరోయిన్ చివరిలో హీరో కోసం ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్తుంది.

movies picturized in airport

#6 వీడొక్కడే
పైన మాట్లాడిన సినిమాలన్నీ కూడా ప్రేమ కథలు. కానీ ఈ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గా సినిమా క్లైమాక్స్ ఎయిర్‌పోర్ట్ లో హీరోని విచారించడంతో చిత్రీకరించారు.

hero surya super hit telugu movies

#7 ప్రయాణం
మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం కూడా ఎయిర్‌పోర్ట్ లోనే సాగుతుంది. ఇది నిజంగానే ఒక డిఫరెంట్ ప్రయత్నం. మొదటి నుండి చివరి వరకు ఒకటే చోట సినిమా నడుస్తుంది.

అయితే చాలా సినిమాల్లో ఎయిర్‌పోర్ట్ లో కేవలం హీరో, హీరోయిన్లకు సంబంధించిన సీన్స్ మాత్రమే కాదు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరిస్తారు. కానీ ఎక్కువగా మాత్రం ప్రేమ కథల్లోనే ఇలాంటి ఎయిర్‌పోర్ట్ సీన్స్ కనిపిస్తాయి. ఇలా ఎయిర్‌పోర్ట్ కూడా చాలా సినిమాల్లో చాలా ప్రేమ కథల్లో ముఖ్య పాత్ర పోషించింది.


End of Article

You may also like