Ads
స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తే పాత్రల గురించి ఆలోచించకుండా చాలామంది హీరోయిన్లు వెంటనే ఓకే చెప్పేస్తారు. లేదంటే చెయ్యను అని చెప్పటానికి కాస్త సంశయిస్తారు. అంతేగాని నో అని చెప్పటానికి చాలామంది వెనుకడుగు వేస్తారు అయితే సాయి పల్లవి మాత్రం ఆమెకి నచ్చని క్యారెక్టర్లు నో చెప్పటానికి ఏమాత్రం వెనకడుగు వెయ్యదు. అలా ఆమె కెరియర్ లో ఆమె చేసిన సినిమాలు కన్నా వదులుకున్న సినిమాలే ఎక్కువ. ఆమె వదులుకున్న సినిమాలన్నీ డిజాస్టర్ లు కావడం గమనార్హం. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
డియర్ కామ్రేడ్ : ఈ సినిమాలో రష్మిక కన్నా ముందు సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారంట కానీ సినిమాలో ఎక్కువగా ముద్దు సీన్స్ ఉండటం వలన సాయి పల్లవి ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసింది.
భోళా శంకర్ : ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో ముందుగా సాయి పల్లవిని అనుకుని ఆమెని సంప్రదించాడంట డైరెక్టర్. అయితే ఆమె ఆ సినిమాని తిరస్కరించడంతో ఆ పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఆ సినిమా ఎంత డిజాస్టరో అందరికీ తెలిసిందే.
చంద్రముఖి 2 : ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ సినిమాలో కూడా కంగనా రౌనత్ పాత్రకి ముందుగా సాయి పల్లవిని తీసుకోవాలని దర్శకుడు వాసు భావించాడంట కానీ సాయి పల్లవి రిజెక్ట్ చేసింది.
లియో: విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా సాయి పల్లవి నే అనుకున్నారు కానీ ఆ పాత్రలో నటనకు అవకాశం లేదంటూ రిజెక్ట్ చేసిందంట సాయి పల్లవి. సినిమా హిట్ అయినప్పటికీ ఎన్నో విమర్శలను ఎదురుకోవడం గమనార్హం .
ఇక ఇప్పుడు ఆమె కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రంలో శివ కార్తికేయన్ సరసన నటిస్తున్నారు. ఏదేమైనా సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అనే టాక్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఏదైనా ఆమె జడ్జిమెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
End of Article