ప్రభాస్, కృతి సనన్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Video Advertisement

ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. ఈరోజు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ‘ఆదిపురుష్’ ట్రైలర్ ప్రీమియర్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. సీతారామ కళ్యాణం:

ఎన్.టి. రామారావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సీతారామ కళ్యాణం’. ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణుడి పాత్ర లో నటించారు.ఈ సినిమాలో రాముడుగా హరనాథ్,  సీతగా గీతాంజలి నటించారు.
2. సంపూర్ణ రామాయణం- 1958:

1958లో వచ్చిన ఈ చిత్రంలో రాముడిగా ఎన్టీ రామారావు, సీతగా పద్మిని నటించారు. ఈ చిత్రంలో భరతుడిగా శివాజీ గణేశన్ నటించారు.
3. లవకుశ:

సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘లవకుశ’ సినిమాలో రాముడుగా ఎన్టీఆర్, సీతాగా అంజలీ దేవి నటించారు. ఈ చిత్రం 1963 లో విడుదల అయ్యింది.
4. పాదుకా పట్టాభిషేకం: 

1966 లో విడుదల అయిన ఈ చిత్రంలో రాముడుగా కాంతారావు, సీతగా కృష్ణ కుమారి నటించారు.
5. వీరాంజనేయ:

ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముడుగా కాంతారావు, సీతగా అంజలీదేవి నటించారు. ఈ చిత్రం 1968లో విడుదలైంది.
6. సంపూర్ణ రామాయణం:

దర్శకుడు బాపు తెరకెక్కించిన తోలి పౌరాణిక చిత్రం  ‘సంపూర్ణ రామాయణం’.  ఈ చిత్రం 1972లో రిలీజ్ అయ్యి  విజయం సాధించింది. ఈ సిచిత్రంలో రాముడుగా శోభన్ బాబు నటించగా, సీతగా చంద్రకళ నటించింది. ఈ చిత్రంలో రావణాసురిడి పాత్రలో ఎస్.వి. రంగారావు నటన అద్వితీయం.
7. శ్రీ రామాంజనేయ యుద్ధం:

బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రాముడు హనుమంతుని మధ్య యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది.  రాముడిగా ఎన్టీఆర్ నటించగా, సీత పాత్రలో  బి. సరోజాదేవి నటించింది, ఈ చిత్రం  1975 లో విడుదల అయ్యింది.

8. సీతా కళ్యాణం:

బాపు గారు తెరకెక్కించిన మరో పౌరాణిక చిత్రం ‘సీతా కళ్యాణం’.  ఈ చిత్రంలోని కథ సీతారాముల కళ్యాణం దాకా మాత్రమే ఉంటుంది. ఈ చిత్రంలో రాముడిగా రవికుమార్ అనే కొత్త నటుడు చేశారు.  సీతగా జయప్రద నటించింది. ఈ సినిమా 1976లో రిలీజ్ అయింది.
9.సీతా రామ వనవాసం:

కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామ వనవాసం’. ఈ చిత్రంలో రాముడిగా రవికుమార్, సీతగా జయప్రద నటించింది. ఈ చిత్రం 1977లో రిలీజ్ అయ్యింది.
10. శ్రీరామ పట్టాభిషేకం: 

ఎన్టీఆర్ రామాయణం ఆధారంగా ‘శ్రీరామ పట్టాభిషేకం’ అని చిత్రాన్ని చేశారు. ఈ చిత్రానికి ఆయనే  దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా, రావణుడిగా నటించారు.  సీత పాత్రలో సంగీత నటించారు. ఈ సినిమా 1978లో రిలీజ్ అయింది.
11. రామాయణం:

ఈ చిత్రాన్ని బాల రామాయణం అని కూడా పిలుస్తారు. ఈ చిత్రం పూర్తిగా బాల నటినటులతో  తీశారు. 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా స్మితా మాధవ్ నటించారు.
12. శ్రీరామరాజ్యం:బాపుగారు దర్శకత్వం వహించిన మరో పౌరాణికం సినిమా ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రానికి రీమేక్ లాంటింది. ఈ చిత్రంలో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. సీతగా నయనతార నటించింది.

13. ఆదిపురుష్:

ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16 న రిలీజ్ కాబోతుంది.

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్ ట్విట్టర్ రివ్యూ..! ఎలా ఉందంటే..?