Ads
బాహుబలి తర్వాత టాలీవుడ్ ప్రతిష్ఠ అమాంతం పెరుగడంతో ఇప్పడు తెలుగు సినిమాల మార్కెట్ జాతీయస్థాయిలో ఘనంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు టాలీవుడ్ ప్రముఖ హీరో, దర్శకులు. అయితే సినీ పరిశ్రమలో కాంబినేషన్స్ అనేవి కీ రోల్ పోషిస్తాయి. హీరో.. హీరోయిన్, హీరో .. డైరెక్టర్స్ ఇలా..కొన్ని సక్సెఫుల్ కాంబినేషన్స్ తమ ముద్రని వేస్తాయి.
Video Advertisement
అయితే డైరెక్టర్ తీసే ప్రతి సినిమా హిట్ అవ్వడం.. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం ప్రతిసారీ సాధ్యం కాదు. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు హిట్ అవ్వలేకపోవచ్చు. ఒకసారి డైరెక్టర్ మంచి హిట్ సినిమా అందించిన తర్వాత ఆ డైరెక్టర్ మీద అంచనాలు ప్రేక్షకులకి భారీగా ఉంటాయి. దీనితో డైరెక్టర్లు కూడా కాస్త తికమక పడి ఫ్లాప్ సినిమాలు ఇస్తూ ఉంటారు.
ఇలా తమ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఎదుర్కొన్న స్టార్ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 త్రివిక్రమ్ – అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు ఒక పండుగ. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి సుమారు 60 కోట్లకు పైగా నష్టం వచ్చింది.
#2 శ్రీకాంత్ అడ్డాల – బ్రహ్మోత్సవం
ఫ్యామిలీ చిత్రాలతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తో రెండో సారి జతకట్టి కాబ్రహ్మోత్సవం లో నటించారు మహేష్. అయితే ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.
#3 కొరటాల శివ – ఆచార్య
కొరటాల శివ సినిమాలన్నీ బావుంటాయి. అలాగే చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆచార్య మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది.
#4 వి వి వినాయక్ – ఇంటిలిజెంట్
మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు తీశారో మనకి తెలుసు. కానీ ఈయన సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటిలిజెంట్ మూవీ ప్లాప్ అయ్యింది.
#5 శ్రీను వైట్ల – అమర్ అక్బర్ ఆంటోనీ
శ్రీను వైట్ల అనగానే మనకి కామెడీ ప్రధానం గా వచ్చిన ఆయన సూపర్ హిట్ చిత్రాలే గుర్తొస్తాయి కానీ ఈయన రవి తేజ తో తీసిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ప్లాప్ అయ్యింది.
#6 మెహర్ రమేష్ – శక్తి
మెహర్ రమేష్ దర్శకత్వం లో వచ్చిన శక్తి మూవీ ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది కానీ డిజాస్టర్ గా నిలిచింది.
#7 ఏఆర్ మురుగదాస్ – స్పైడర్
మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన స్పైడర్ తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్‌గా రూపొందించబడింది. సెప్టెంబర్ 2017 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
#8 క్రిష్ – ఎన్టీఆర్ సిరీస్
డైరెక్టర్ క్రిష్ కి చక్కటి చిత్రాలు తెరకెక్కిస్తారు అన్న పేరు ఉంది. కానీ ఎన్టీఆర్ నిజ జీవితం ఆధారం గా తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి.
#9 కృష్ణ వంశీ – నక్షత్రం
సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాలు, లేకపోతే సస్పెన్స్ ఉండే అంతపురం, డేంజర్ లాంటివి కృష్ణ వంశీ మార్క్ మూవీస్. కానీ ఈయన తీసిన నక్షత్రం మూవీ గత చిత్రాలకు బిన్నం గా ఉండి డిజాస్టర్ అయ్యింది.
#10 పూరి జగన్నాధ్ – లైగర్
పూరి సినిమా అంటే స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్స్, క్రేజీ వన్ లైనర్స్, మాస్ ఎలిమెంట్స్. కానీ ఇవేమి లేకపోవడం తో భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ మూవీ డిజాస్టర్ అయ్యింది.
#11 గుణశేఖర్ – శాకుంతలం
గుణశేఖర్ అంటే మంచి చేస్ లు, సెట్స్, హీరోయిజం, ఎలివేషన్స్ ఉంటాయి. కానీ ఆయన తీసిన పౌరాణిక చిత్రం శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. మహేష్ తో తీసిన సైనికుడు మూవీ కూడా ప్లాప్ అయ్యింది కానీ దానికి మించి ప్లాప్ అయ్యింది శాకుంతలం.
#12 సురేందర్ రెడ్డి – ఏజెంట్
స్టైలిష్ చిత్రాలు తీయడం లో సిద్ధహస్తుడు సురేందర్ రెడ్డి. దీంతో పాటు ఆయన చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ తాజాగా వచ్చిన ఏజెంట్ మూవీ ఊహించని విధం గా అట్టర్ ప్లాప్ అయ్యింది.
#13 విక్రమ్ కే కుమార్ – థాంక్యు
కెరీర్ మొదటి నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ హిట్స్ కొట్టారు విక్రమ్ కుమార్.. కానీ థాంక్ యు మూవీ తో ఆయనకు బిగ్ ప్లాప్ వచ్చింది.
#14 బోయపాటి శ్రీను – వినయ విధేయ రామ
బోయపాటి సినిమాల్లో లాజిక్స్‌కి అందని మ్యాజిక్‌లు, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ వీవీఆర్లో మాత్రమే ఆ మాస్ ఎలిమెంట్స్ ని కొంచెం ఎగ్జగరేట్ చేసి చూపించడం వల్ల ప్రేక్షకులు ప్లాప్ చేసారు ఈ మూవీ ని.
#15 రాధా కృష్ణ కుమార్ – రాధే శ్యామ్
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన, రాధే శ్యామ్ ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ. మార్చి 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
End of Article