Ads
ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఏ ప్యాన్ ఇండియా సినిమానో, లేదా బిగ్ హీరో సినిమానో వస్తే తప్ప ప్రేక్షకులు మల్టీప్లెక్స్ వైపు మొగ్గు చూపట్లేదు. తమ ఫేవరెట్ ఓల్డ్ మూవీ కానీ.. తమ ఫేవరేట్ హీరో హిట్ మూవీ ని పుట్టినరోజుకు, వారి స్పెషల్ డేస్ కి రిలీజ్ చెయ్యడం ట్రెండ్ గా మారింది. ఈ రీ రిలీజ్ లకి ఈ మధ్య కాలం లో ఆదరణ పొందింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్ ల సినిమాలు మళ్ళీ విడుదల అయ్యి మంచి లాభాలు పొందాయి.
Video Advertisement
దీంతో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి..మరి ఆ సినిమాలేవో.. ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..
#1 టైటానిక్
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన టైటానిక్ మూవీ సినిమా ప్రియులందరికీ ఫేవరేట్ మూవీ. భాషాబేధం లేకుండా అందరికి ఈ చిత్రం నచ్చింది. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 10 న రీ రిలీజ్ కానుంది.
#2 గ్యాంగ్ లీడర్
చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 11 న రీ రిలీజ్ చేయనున్నారు.
#3 నువ్వొస్తానంటే నేనొద్దంటానా..
సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన సూపర్ హిట్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాన్ని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 11 న రీ రిలీజ్ కానుంది.
#4 బద్రి
పూరి జగన్నాథ్ దర్శకత్వం పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ బద్రి. ఈ చిత్రం లో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18 న రీ రిలీజ్ కానుంది.
#5 పిల్ల జమిందార్
నాని కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటైన పిల్ల జమిందార్ చిత్రాన్ని నాని బర్త్డే సందర్భంగా ఫిబ్రవరి 18 న రీ రిలీజ్ చేయనున్నారు.
#6 ఇష్క్
నితిన్ కం బ్యాక్ మూవీ అయిన ఇష్క్ చిత్రాన్ని మార్చి 20 న నితిన్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు.
#7 మగధీర
దర్శక ధీరుడు రాజమౌళి తో రామ్ చరణ్ చేసిన చిత్రం మగధీర. ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టిన రోజు అయినా మార్చి 27 న రీ రిలీజ్ చేయనున్నారు.
#8 ఆరంజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఆరంజ్ చిత్రానికి ఫాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27 న రీ రిలీజ్ చేయనున్నారు.
#9 ఈ నగరానికి ఏమైంది
ఫీల్ గుడ్ మూవీ అయిన ఈనగరానికి ఏమైంది చిత్రం హీరో విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 29 న రీ రిలీజ్ కానుంది.
#10 సింహాద్రి
జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన సింహాద్రి చిత్రాన్ని అతడి బర్త్డే సందర్భంగా మే 20 న రీ రిలీజ్ చేయనున్నారు.
End of Article