Ads
టాలీవుడ్ లో విజయాల శాతం చాలా తక్కువ. ప్రతి ఏడాది 150 నుంచి 200 వరకు సినిమాలు రిలీజైనా అందులో సక్సెస్‌లు సంఖ్య 20 నుంచి 30 మధ్యలోనే ఉంటుంది. వరుసగా విజయాలు దక్కడం అరుదనే చెప్పుకోవాలి. కానీ 2023లో అప్పుడే రెండు నెలలు ముగిసిపోయాయి. అయితే జనవరి నెలలో అత్యంత కీలకమైన సంక్రాంతి సీజన్‌లో రెండు డైరెక్ట్ చిత్రాలు.. రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర లక్ పరీక్షించుకున్నాయి. అందులో బాలయ్య .. వీరిసింహారెడ్డితో పలకరిస్తే.. చిరంజీవి.. వాల్తేరు వీరయ్యతో దుమ్ము దులిపాడు. అలాగే ఫిబ్రవరి లో కూడా మూడు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఏ చిత్రాలు దుమ్ము దులిపాయో వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1 వాల్తేరు వీరయ్య
జనవరి 13న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తొలి రోజు నుంచి దుమ్ము దులుపుతూ సంక్రాంతి సీజన్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం .. ఇప్పటి వరకు రూ. 134.37కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 46 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది. బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
#2 వీర సింహ రెడ్డి
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’కి తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 80 కోట్ల షేర్ తో హిట్ స్టేటస్ అందుకుంది.
#3 వారసుడు
వంశి పైడిపల్లి దర్శకత్వం లో విజయ్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసారు. తెలుగులో రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి రూ. 15.01 కోట్లు రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది.
#4 రైటర్ పద్మ భూషణ్
సుహాస్ హీరో గా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ చక్కటి వసూళ్లను రాబడుతోంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా తొలి వారంలో పది కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల్ని మిగిల్చింది.
#5 సార్
తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన తొలి తెలుగు డైరెక్ట్ మూవీ సార్. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకుంది. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సత్తా చాటింది.
#6 వినరో భాగ్యము విష్ణు కథ
యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 23 లక్షల ఫ్రాఫిట్‌తో హిట్ స్టేటస్ అందుకుంది.
End of Article