Ads
సినీ ఇండస్ట్రీ లో కాంట్రవర్సిస్ అనేవి చాలా సాధారణం. అది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వివాదాలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సినిమా టైటిల్స్ నుంచి.. పాడిన పాటల వరకు కాంట్రవర్సీలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మొదలు కావడం తోనే పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
Video Advertisement
అయితే వివాదాలు వచ్చినా.. అడ్డంకులు ఎదురయినా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్స్ అయ్యాయి. వివాదాలు రావడం వల్ల సినిమాలకు మంచి పబ్లిసిటీ దక్కుతోంది. సినిమా గురించి కేసు అవ్వడం లేదంటే ఏదో ఒక సంఘం వారు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ మీడియా ముందుకు రావడం వల్ల మాత్రమే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఏ ఏ మూవీస్ ఉన్నాయో చూద్దాం..
#1 ది కేరళ స్టోరీ
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి పలు వివాదాలు వచ్చాయి. కేరళలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ క్యాంపుల్లో పంపించి దేశ వ్యతిరేకులుగా మార్చారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
వివాదాస్పద అంశం అంటూ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. సినిమా ను తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
#2 దువ్వాడ జగన్నాధం
ఈ సినిమాలోని ఒడిలో బడిలో సాంగ్ చాలా పెద్ద కాంట్రవర్సీ క్రీట్ చేసింది. ఎంత అంటే మూవీ డైరెక్టర్ ఆ సాంగ్ లోని లిరిక్స్ కొన్ని చేంజ్ చేసే అంతగా. బ్రాహ్మణ సంఘాలు ఈ ప్రొటెస్ట్ చేసాయి. ఇక కొన్ని సన్నివేశాల పట్ల కూడా వివాదాలు వచ్చాయి. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయ్యింది.
#3 బస్ స్టాప్
ఈ మూవీ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలోని సీన్స్ చాలా వరకు వల్గర్ గా ఉన్నాయి అని చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేసాయి. సంధ్య థియేటర్ ముందు ఫ్లెక్సీ లు కూడా కాల్చి పారేశారు.. యూత్ ను చెడగొట్టే విదంగా ఈ సినిమాను తీశారు అంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ చాలా హంగామా చేసారు..సినిమా రిలీస్ అయ్యి విజయం సాధించింది.
#4 కృష్ణం వందే జగద్గురుమ్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ లో రానా హీరో గా నటించారు. ఈ మూవీ మొత్తం బళ్లారి మైనింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఒక ప్రముఖ పార్టీ లీడర్ ని ఈ మూవీ లోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అని పొలిటికల్ పార్టీస్ చాలా గొడవ చేసాయి. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.
#5 దేనికైనా రెడీ
సినిమా గురించి కొన్ని బ్రాహ్మణ ఆర్గనైజషన్స్ కంప్లైంట్ చేశాయి.. పెద్ద సిన్ ఏ క్రియేట్ చేశాయి.. కానీ సినిమాలో ఏం లేదు.. అన్ని కామన్ గా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కానీ ఎం ఉపయోగం లేదు.. సినిమా రిలీస్ అయ్యి మంచు వారికి మంచి విజయాన్ని ఇచ్చింది ఈ సినిమా.
#6 అర్జున్ రెడ్డి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా మార్చింది ఈ మూవీ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీ లో అభ్యంతరకరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులు సినిమా పోస్టర్లను చించేశారు కూడా. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
#7 పఠాన్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే యాక్ట్ చేసిన సినిమా రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ కి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో మనకి తెలుసు. కానీ దానికి ముందు ఈ సినిమా ని బ్యాన్ చెయ్యాలి అని కొన్నాళ్ళు వాడి వేడి చర్చలు, నిరసనలు, సినిమా పోస్టర్స్ ని చింపేసి థియేటర్ ఓనర్స్ ని బెదిరించి సినిమా రిలీజ్ చేసారు అవ్వకుండా చేద్దాం అనుకున్నారు. అసలు ఈ వివాదానికి కారణం ఆ సినిమాలో ఒక పాటలో దీపిక ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవడం.
ఆ కలర్ డ్రెస్ ఓక మత విశ్వాసాలను దెబ్బతీసేలా చేశాయి అని రాజకీయ పార్టీలు మరియు అనేక సంస్థలు ఆ సినిమాని నిషేధించాలి అన్నారు. కానీ ఆ మూవీ 1000 కోట్లు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి మంచి యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచింది.
#8 కాశ్మీరీ ఫైల్స్
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం లో కాశ్మీర్ లో ఉన్న కాశ్మీరీ పండిట్స్ గురించి వాళ్ళు పడ్డ కష్టాల గురించి చెప్పారు. ఐతే ఈ సినిమా నిజమైన నిజాలు ని చూపించలేదు అని పక్షపాతంగా సినిమా ని తీసారు అని ఒక వర్గం ప్రజలు నిరసన చేసారు. దాదాపు 10 రెట్లు సినిమా బడ్జెట్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
#9 పద్మావత్
2017 టైమ్లో చాలా పెద్ద వివాదం అయినా సినిమాల్లో ఇది ఒక్కటి. ఈ సినిమాలో ఘూమర్ అనే పాటలో దీపికా కాస్ట్యూమ్ అనుచితంగా ఉంది అని రాజ్పుత్ సంస్థలు మరియు ఇతర సంఘాలు నిరసన చేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.
#10 PK
ఈ మూవీ లో సున్నితమైన మాట విశ్వాసాలను ప్రశ్నిచడం తో కొందరు ఈ చిత్రం విడుదల కాకూడదు అని అన్నారు. కానీ ఇది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
#11 డర్టీ పిక్చర్
ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితం ఆధారం గా వచ్చిన చిత్రం ది డర్టీ పిక్చర్. మూవీలో ఉన్న కంటెంట్ చాలా మందికి నచ్చలేదు, అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది అని సినిమాని బ్యాన్ చేయమన్నారు. ఈ చిత్రాన్ని అద్భుతం గా తెరకెక్కించారు.
#12 బలగం
మార్చి 3న విడుదలై సూపర్ హిట్ మూవీ బలగం. కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ మూవీ కథ నాదే అంటూ ప్రముఖ తెలంగాణ దినపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ గడ్డం సతీష్ అన్నారు. 2011లో తాను రాసిన ‘పచ్చికీ’ కథను బలగం పేరుతో కాస్త చిన్న మార్పులు చేసి తెరకెక్కించారని ఆయన అన్నారు.
#13 ఆర్ఆర్ఆర్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ పై కూడా మొదట్లో పలు వివాదాలు వచ్చాయి. అల్లూరి సీతా రామ రాజు, కొమరం భీం లను తప్పుగా చూపించారు అంటూ పలు వివాదాలు వచ్చాయి. అలాగే కొమరం భీం నిజాం కి వ్యతిరేకం గా పోరాటం చేస్తే ఆయన్ని ముస్లిం గా చూపించటం ఏంటి అంటూ నిరసనలు చేసారు.
#14 బాహుబలి
బాహుబలి తమిళ వెర్షన్ లోని ఒక డైలాగ్ దళితుల పట్ల అవమానకరమైనవిగా పరిగణించబడుతున్నాయని ఆ సంఘ సభ్యులు పేర్కొన్నారు. దీంతో దళితులను కించపరిచినందుకు తమిళ వెర్షన్ డైలాగ్ రైటర్ మధన్ కార్కీ క్షమాపణలు చెప్పారు.
ALSO READ : “దువ్వాడ జగన్నాథం” తో పాటు… సీన్స్ వల్ల “కాంట్రవర్సీ” సృష్టించిన 16 సినిమాలు..!
End of Article