“శక్తి” తో పాటు… “ట్రైలర్” తో అంచనాలు పెంచి “అట్టర్ ఫ్లాప్” అయిన 10 సినిమాలు..!

“శక్తి” తో పాటు… “ట్రైలర్” తో అంచనాలు పెంచి “అట్టర్ ఫ్లాప్” అయిన 10 సినిమాలు..!

by kavitha

Ads

తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ళ నుండి సినిమా రిలీజ్ అవడానికి కొన్ని రోజుల ముందు నుండే పోస్టర్లు, టీజర్, పాటలు,  ట్రైలర్‌ విడుదల చేస్తూ తమ సినిమా పై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. వాటిలో స్టార్ హీరోల సినిమాల టీజర్, ట్రైలర్‌ లకు అటు ప్రేక్షకులలో ఇటు అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

Video Advertisement

కానీ రిలీజ్ అయిన తరువాత ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్లుగా మారిన సినిమాలు ఉన్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ తో హై ఎక్స్పెక్టేషన్స్ పెంచి, రిలీజ్ అయిన తరువాత ఫ్లాప్ గా నిలిచిన చిత్రాలు ఇవే..
movies-released-with-huge-expectations-and-became-flops1. శక్తి:

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శక్తి. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ రిలీజ్ అయ్యాక డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ ఎన్టీఆర్ కు మైనస్ గా మారింది.2. స్పైడర్:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ మూవీ టీజర్ , ట్రైలర్‌ లతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, విలన్ గా ఎస్ జే సూర్య నటించారు.
3.అజ్ఞాతవాసి:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ నటించారు.4. దడ:

యంగ్ హీరో నాగచైతన్య, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా దడ. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
5. డియర్ కామ్రేడ్

గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్లాప్ గా నిలిచింది.
6.సాహో:

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో సాహో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి, ఫ్లాప్ గా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. 
7. ది ఘోస్ట్:

కింగ్ నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన యాక్షన్‌ స్పైథ్రిల్లర్‌ ది ఘోస్ట్.  ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. కానీ రిలీజ్ అయ్యాక ఫ్లాప్ గా నిలిచింది.
8. రావణాసుర:

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా కావడం, ఆయన పాత్ర టీజర్, ట్రైలర్ లో డిఫరెంట్ గా కనిపించడంతో ఈ మూవీ పై ఆడియెన్స్ లో అంచనాలు అమాంతం పెరిగాయి. కానీ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది.
9. శాకుంతలం:

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం. దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
10. ఏజెంట్:

అక్కినేని అఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఏజెంట్. ఈ మూవీలో కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా నటించారు. టిజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Also Read: ఆడవారిలో ఉన్న ఈ విషయం వల్లే చాలా పెళ్లిళ్లు నిలవట్లేదా..? ఈ డైరెక్టర్ ఏం అన్నారంటే..?


End of Article

You may also like