సినిమా బాగుంది…కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలీదు.! అలాంటి 13 సినిమాలు.!

సినిమా బాగుంది…కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలీదు.! అలాంటి 13 సినిమాలు.!

by Harika

Ads

కొన్ని సినిమాల్లో కథ ఎంత బాగున్నా థియేటర్ లో ఆశించిన ఫలితాలు రావు. కామన్ ఆడియన్స్ ఎక్కువగా రొటీన్ సినిమాలనే ఇష్టపడతారు. దీంతో కొంచెం ప్రయోగాత్మకంగా, కొత్తగా కథ చెప్పాలి అనుకున్న డైరెక్టర్స్ కి నిరాశే ఎదురవుతుంది. దీంతో తెరపై కొత్తదనాన్ని చూడాలి అనుకునే సగటు మూవీ లవర్ కి నిరాశే మిగులుతుంది.

Video Advertisement

థియేటర్ లో కలెక్షన్స్ రానీ ప్రయోగాత్మక మరియు ఫీల్ గుడ్ మూవీస్ గా మిగిలిపోయిన కొన్ని సినిమాలను ఇప్పుడు చూద్దాం . .

#1. అంటే.. సుందరానికీ!:

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నుంచి వచ్చిన మంచి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే.. సుందరానికీ!. న్యాచురల్ స్టార్ నానీ, నజ్రియా కలిసి కథకు ప్రాణంపోసారు. ఈ చిత్ర నిర్మాతలు నష్టపోయిన ఉండొచ్చు కానీ ఓటీటీలో ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. ఓ కొత్త కథను తెలుగు ప్రేక్షకులకు అందించాడు వివేక్.

#2. విరాట పర్వం:
సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. దర్శకుడు వేణు ఊడుగుల ఈ రోజుల్లో అలాంటి నక్సల్ బ్యాక్గ్రౌండ్ కథను ఎంచుకోవడం ఒకరకంగా సాహసం అనే చెప్పొచ్చు. విప్లవంలో ప్రేమను మిక్స్ చేసి రొటీన్ కథకు భిన్నంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

#3. ఖలేజా:
ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కావాల్సినవన్నీ ఖలేజా మూవీలో ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా కావడంతో అంచనాలు పెరగడం ఒక కారణం కావొచ్చు. ఇందులో మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ ఉంటుంది.

#4. వేదం:
క్రిష్ కెరీర్‌లో వేదం ఒక బెస్ట్ ఫిల్మ్. కథ, నిర్మాణం, ఈ సినిమాలో చూపించిన ఫిలాసఫీ అన్ని ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ స్థాయిని గుర్తుకు తెస్తాయి. ఇది కేవలం తెలుగు సినిమా అవ్వడం వలన ఇక్కడి ప్రేక్షకులు దాన్ని బ్లాక్ బస్టర్ చేయకపోవడంతో కలెక్షన్స్ లో సాధారణ సినిమాగా మిగిలిపోయింది కానీ ఇది టాలీవుడ్ ఓ మాస్టర్ పీస్.

#5. అ:
ఇదో సైకాలజికల్ థ్రిల్లర్. పాత్రల్లో కొత్తదనం కనిపించే స్క్రిప్ట్‌తో రూపొందిన కాన్సెప్ట్ చిత్రం అ!. ఒక్కపాత్ర జర్నీ ఒక్కో ఎపిసోడ్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. కాకపోతే సగటు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఉంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ప్రయోగాత్మక చిత్రాల్లో ముందుంటుంది.

#6. ఈ నగరానికి ఏమైంది?:
దర్శకుడు తరుణ్ భాస్కర్ సాధారణమైన స్టోరీ లైన్ ను తీసుకున్నా అందులో కొన్నాళ్ళ పాటు గుర్తుండిపోయే నాలుగు పాత్రల్ని రాసి, వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో ఫన్నీ కథనాన్ని అల్లుకున్నారు. ఈ సినిమా యువతకు దగ్గరయ్యేదిగా ఉండగా రెగ్యులర్ యాక్షన్ సినిమాల్ని కోరుకునే వారిని, కుటుంబ ప్రేక్షకులను సంతృప్తిపరిచే కంటెంట్ ఇందులో లేదు. రెగ్యులర్ సినిమాలు చూసి విసుగెత్తే ఫ్రెండ్స్ గ్యాంగ్స్ కు ఈ చిత్రం మంచి రిలీఫ్.

#7. డియర్ కామ్రేడ్:
అప్ప‌టి వ‌ర‌కు చూసిన సినిమా కాకుండా మ‌రో కొత్త సినిమా చూపించాడు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌. హీరో ప్రేమ‌లో విఫ‌లం కాగానే బైక్ ఎక్కేసి ఇంటిని కూడా వ‌దిలేసి ఏళ్ల పాటు ట్రావెల్ చేయ‌డం అనేది మ‌న‌కు అల‌వాటు లేని క‌థ‌. ద‌ర్శ‌కుడిగా అనుకున్న క‌థ‌ను తెర‌కెక్కించాడు కానీ ఈ ప్ర‌యాణంలో క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అవుతుందా అనేది మాత్రం ప‌ట్టించుకోకుండా హానెస్ట్ గా క‌థ చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు.

#8. జానీ:
జానీ సినిమాలో నటుడు, దర్శకుడు రెండూ పవన్ కళ్యాణ్‌ నే. ఇందులో మంచి ఫోటోగ్రఫీ, అద్భుతమైన విన్యాసాలు, విభిన్న స్థానికులు జానీ ప్రయాణంలో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ, సినిమా మేకింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది.

#9. 1: నేనొక్కడినే:

సుకుమార్ తీసిన అద్భుతమైన చిత్రం 1. నేనొక్కడినే. ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా ఫలితంతో మహేష్ ప్రయోగాత్మక చిత్రాలకు దూరం అయ్యాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఆహ్వానించలేరు అని. వారికి కావలసింది స్టార్ హీరో నుండి పక్కా కమర్షియల్ పైసా వసూల్ సినిమాలే కానీ ప్రయోగాలు కాదు.

#10. జగడం:
సిటీ ఆఫ్ గాడ్ లాంటి హాలీవుడ్ సినిమా ఇది. ఇది బ్లాక్‌బస్టర్ మరియు కల్ట్ ఫిల్మ్‌ కి ఉండే హంగులన్నీ ఉన్నాయి. ఇండియా మొత్తం మాట్లాడాల్సిన ఒక చిన్న కల్ట్ ఫిల్మ్ ఇది. అలా ఉంటుంది సుకుమార్ మేకింగ్ ఈ సినిమాలో. కానీ ఈ సినిమాను కూడా మన తెలుగు ప్రేక్షకులు ఫెయిల్ చేశారు.

#11. చక్రం:
కృష్ణవంశీ రూపొందించిన హార్ట్ టచింగ్ మూవీ చక్రం. సినిమాలో కామెడీ మరియు ఎమోషన్ రెండూ ఉంటాయి. ఇది హృదయాన్ని హత్తుకునే చిత్రం మరియు ప్రకాష్ రాజ్ ఇచ్చిన సందేశం ఏడ్పించేలా ఉంటుంది. కానీ కలెక్షన్స్ ఈ సినిమా వెనకపడిపోయింది.

#12. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్:
వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రవితేజ చేసిన బెస్ట్ అండ్ మీనింగ్ ఫుల్ సినిమా ఇది. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాగుంటాయి. మంచి అనుభూతిని కలిగించే చిత్రం. ఇది నిజంగా బాల్యం మరియు కాలేజ్ లైఫ్ మెమోరీస్ ను రిఫ్రెష్ చేస్తుంది.

#13. జాను:
జాను సహజత్వం ఉట్టిపడేలా ఉంటుంది. ఒక సినిమా చూసిన ఫీల్ కాకుండా కొంతమంది మనుషులను, వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలను పక్కనే ఉండి చూసిన అనుభూతి కలుగుతుంది. తమిళ్‌లో మోడరన్ క్లాసిక్ అని పేరు తెచ్చుకున్న 96 ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు దిల్ రాజు. కానీ ఇక్కడ ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. ఇవే కాకుండా ఇలాంటి చిత్రాలు తెలుగులో అనేకం ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ కరువయ్యి టాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీయాలంటేనే హీరోలు, డైరెక్టర్లు ఆచితూచి వ్యవహారించే పరిస్థితి ఏర్పడింది.


End of Article

You may also like