Ads
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 7 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది.
Video Advertisement
కరోనా తరువాత ఇతర ఇండస్ట్రీల కన్నా ఆడియెన్స్ ని ఎక్కువగా థియేటర్లకు రప్పించిన ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కటే. మరి ఈ ఏడాది ఇప్పటివరకు విజయం సాధించిన సినిమాలు ఏమిటో ఇపుడు చూద్దాం..
#1 వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ హీరోలుగా వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదలై 230 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సంక్రాంతి విజేతగా నిలిచింది.
#2 వీర సింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలై వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేశారు. ఈ మూవీలో శృతి హాసన్, హానీరోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు.
#3 సార్
కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన మొదటి తెలుగు చిత్రం సార్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ధనుష్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
#4 రైటర్ పద్మభూషణ్
చిన్న సినిమాగా రిలీజ్ అయిన రైటర్ పద్మభూషణ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో సుహాస్ హీరోగా నటించారు.
#5 వినరో భాగ్యము విష్ణు కథ
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది. వరుస ప్లాప్ ల తరువాత కిరణ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.
#6 బలగం
కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మరి తీసిన మొదటి చిత్రం ‘బలగం. చిన్న సినిమాగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, విడుదల అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
#7 దాస్ కా ధమ్కి
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా దాస్ కా ధమ్కి. విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది.
#8 దసరా
శ్రీకాంత్ ఓదెల తొలిసారి తెరకెక్కించిన దసరా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు.
#9 విరూపాక్ష
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
#10 బిచ్చగాడు 2
2016లో వచ్చిన బిచ్చగాడు మూవీ సీక్వెల్ గా వచ్చింది బిచ్చగాడు 2 . స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ.. ఫైనల్ గా మూవీ హిట్ అయ్యింది.
#11 2018
టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 2018 . జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2018 లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యం లో సాగుతుంది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.
#12 మేమ్ ఫేమస్
యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో.. హీరోగా వచ్చిన చిత్రం మేమ్ ఫేమస్. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
End of Article