Ads
టాలీవుడ్ లో మొట్టమొదటి పూర్తిస్థాయి కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ అంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు. నవరసాలను అద్భుతంగా పండించగల పరిపూర్ణ నటుడు. అందుకే హీరోగా అవకాశాలు తగ్గాక.. సహాయనటుడిగా రకరకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు ఈ నటకిరీటీ రాజేంద్రప్రసాద్.
Video Advertisement
డైరెక్టర్ వంశీ 1985లో రాజేంద్ర ప్రసాద్‌ను పెట్టి హీరోగా ‘ప్రేమించు-పెళ్లాడు’ అనే సినిమా తీశాడు. కానీ హీరో డెబ్యూ మూవీ రాజేంద్ర ప్రసాద్‌కి నిరాశే మిగిల్చింది. అయినా వంశీ రాజేంద్ర ప్రసాద్‌ను వదల్లేదు. ఈసారి కసితో ‘లేడీస్ టైలర్’ (1986) తీశాడు. ఫలితం.. సంచలన విజయం. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అనేక సినిమాల్లో నటించి తన వైవిధ్యమైన నటనతో కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ టాప్ 10 పెర్ఫార్మన్స్ మూవీస్ ని ఓసారి చూద్దాం . .
#1. రాంబంటు:
బాపు దర్శకత్వంలో వచ్చిన రాంబంటు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరియు ఈశ్వరీ రావు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రాజేంద్రప్రసాద్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
#2. రాజేంద్రుడు గజేంద్రుడు:
ఈ మూవీకి ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య కలిసి నటించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ కామెడీతో అందరిని ఆకట్టుకున్నాడు.
#3. లేడీస్ టైలర్:
డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన నటించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ తన మార్క్ కామెడీతో అలరించాడు.
#4. కాష్మోరా:
కాష్మోరా 1986లో విడుదలైన భయానక చిత్రం. ఉషోదయ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ మరియు భానుప్రియ నటించారు. శూద్ర పూజలు చేసి మాంత్రికుడిగా తన నటనలో మరో కోణాన్ని చూపించాడు.
#5. మేడమ్:
మేడమ్ 1994లో విడుదలైన కామెడీ చిత్రాన్ని సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరియు సౌందర్య నటించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ లేడీ పాత్రలో అందరిని నవ్వించాడు.
#6. అహ నా పెళ్ళంట!:
అహ నా-పెళ్లంట! 1987లో జంధ్యాల రచించి దర్శకత్వం కామెడీ మూవీ. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మరియు రజనీ నటులు కాగా కోటా శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, మరియు బ్రహ్మానందం నటించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మామను ఆకట్టుకునే పిసినారీ పాత్రలో ఒదిగిపోయాడు.
#7. మహానటి:
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. దీనికి నాగ్ అశ్విన్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించగా రాజేంద్రప్రసాద్ సావిత్రిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాబాయి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు.
#8. జులాయి:
జులాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇందులో అల్లు అర్జున్ కి పోటీగా రాజేంద్రప్రసాద్ కామెడీతో ఆకట్టుకుంటాడు.
#9.నాన్నకు ప్రేమతో:
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో ఎన్టీఆర్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.
#10. కౌసల్య కృష్ణమూర్తి:
కౌసల్య కృష్ణమూర్తి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు నటించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతు పాత్రలో, హీరోయిన్ కు తండ్రిగా నటించారు.
#11. ఆ నలుగురు:
ఆ నలుగురు చిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఆమని నటించారు. ఇందులో రఘురామ్ పాత్రలో కంటతడి పెట్టించాడు రాజేంద్రప్రసాద్. ఇవేకాక ఓనమాలు, మీ శ్రేయోభిలాషి సినిమాలు ఆయన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించాయి.
End of Article