Ads
విక్టరీ వెంకటేష్ … సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. చాలా గొప్ప నటుడు. అంతే కాదు సంపూర్ణ నటుడు కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో విశ్వరూపం చూపిస్తాడు. స్టార్ హీరోలైన చిరు, నాగ్, బాలయ్య కెరీర్ లో ఎదో ఒక సందర్భం లో గ్యాప్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్లే.. కానీ వెంకటేష్ మాత్రం అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికి తెలుగు వారికి ఫేవరేట్ హీరోనే.. ఆయన కెరీర్ మొదటి నుంచి బ్రేక్స్ లేకుండా సాగుతూనే ఉంది.
Video Advertisement
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు హీరో వెంకటేష్. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ఎంతోమంది హీరోయిన్లను వెంకీ తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు విక్టరీ వెంకటేష్ ని ఎక్కువ ఫ్యామిలీ సినిమాల వైపు ప్రేరేపించాయి. వెంకీ లో మాస్ ఎనర్జీ ఉన్నప్పటికీ ఎందుకో ఆ జానర్ ని ఎక్కువ టచ్ చేయలేకపోయారు.
అయితే ఇప్పుడు వెంకటేష్ కెరీర్ లో ఆయన లోని నటుడ్ని బయటకు తీసిన చిత్రాలేవో చూద్దాం..
#1 కలియుగ పాండవులు
వెంకటేష్ సినీ ప్రస్థానం 1986 లో వచ్చిన కలియుగ పాండవులు చిత్రం తో మొదలైంది. సూపర్ స్టార్ కృష్ణ తో చేయాలనుకున్న చిత్రాన్ని తన కుమారుడితోనే తీశారు నిర్మాత రామానాయుడు గారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తోనే వెంకటేష్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
#2 చంటి
తమిళ్ లో వచ్చిన చిన్న తంబీ సినిమాని తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేసారు. వెంకటేష్ లోని నటుడ్ని బయట పెట్టిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
#3 రాజా
1999 వచ్చిన రాజా చిత్రం వెంకటేష్ కెరీర్ని పీక్స్ లోకి తీసుకెళ్లింది. ఈ సినిమాకి వెంకటేష్ నంది అవార్డు గెలుచుకున్నాడు.
#4 స్వర్ణ కమలం
సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే విశ్వనాధ్ గారు తెరకెక్కించిన స్వర్ణ కమలం చిత్రం లో నటించారు వెంకటేష్. దీనికి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు వెంకీ.
#5 ప్రేమ
ఒక భగ్న ప్రేమికుడిగా వెంకటేష్ ఈ చిత్రం లో నటించారు. దీనికి వెంకీ నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.
#6 సూర్య వంశం
తండ్రి నిరాదరణకు గురైన ఒక కొడుకు పాత్రలో వెంకటేష్ ఈ సినిమాలో చేసాడు. ఈ చిత్రం లో వెంకటేష్ ద్వి పాత్రాభినయం చేసాడు.
#7 ఘర్షణ
గౌతమ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో వెంకటేష్, ఆసిన్ జంటగా నటించారు. ఈ చిత్రం లో నటనకి వెంకటేష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
#8 శీను
దర్శకుడు శశి ఈ చిత్రాన్ని చాలా అద్భుతం గా తెరకెక్కించారు. తన ప్రేయసి కోసం మూగవాడిగా నటించిన శీను.. చివరికి ఆమె కోసం తన నాలుకనే కోసుకుంటాడు. ఈ పాత్రలో వెంకటేష్ జీవించారని చెప్పొచ్చు.
#9 నువ్వు నాకు నచ్చావ్
వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది.
#10 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ చిత్రం లో వెంకటేష్ ఒక నిరుద్యోగి గా నటించాడు. అంతే కాకుండా పలు వేరియేషన్స్ చూపించాడు వెంకీ. ఈ చిత్రానికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు వెంకీ.
End of Article