Ads
సినిమాను ఎంత గొప్పగా ఉంది అనేది డిసైడ్ చేసేదే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ని ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తే సినిమా అంత హిట్ అవుతుంది.
Video Advertisement
కథ, కథనం పక్కాగా ప్లాన్ చేసుకున్నా క్లైమాక్స్ లో కొంచెం తేడా కొట్టినా బాక్సాఫీస్ లో వసూళ్లు రాబట్టడం కష్టమే.. సినిమా ముగింపు ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండు అనిపించే 10 సినిమాలని చూద్దాం..
#1. లవ్ స్టోరీ:
సినిమా మొత్తం మంచి మాటలు, పాటలతో సాగిపోతున్న లవ్ స్టోరీలో ఓ వార్నింగ్ లాంటి మెసేజ్ కూడా చూయించాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. క్లైమాక్స్ మాత్రం ఫ్లాట్ గా ఎండ్ చేయడంతో కొంత నిరుత్సాహం కలుగుతుంది.
#2. 7/G బృందావన కాలనీ:
ఓ చక్కటి లవ్ స్టోరీ తో తెరకెక్కిన చిత్రం 7/G బృందావన కాలనీ. ఈ చిత్రానికి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ చిత్రం ముగింపు మాత్రం అంత ఆశాజనకంగా అనిపించదు.
#3. భీమిలి కబడ్డీ జట్టు:
మొదటి భాగమంతా సరదాగా కథ సాగుతుంది. సెకండాఫ్ కబడ్డీ ఆట గురించి ఉంటుంది. కానీ క్లైమాక్స్‌లో గుండెలు బలవంతంగా పిండినట్లు చేశాడు. సూరి పాత్రను సెంటిమెంట్ కోసం బలవంతంగా చంపేసినట్టుంటుంది.
#4. నేనే రాజు నేనే మంత్రి:
రాజకీయ కుర్చీలాటలో పడి చివరకు భార్య కూడా ఛీ కొట్టే పరిస్థితికి వస్తాడు జోగేంద్ర. రాధ కోసమే సర్పంచి స్థాయి నుండి సీఎం కుర్చీ వరకు వస్తాడు జోగేంద్ర. ఉరి శిక్ష వరకు జోగేంద్రను తీసుకెళ్లిన పరిస్థితులు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి.
#5. జెర్సీ:
జెర్సీ అనే సింపుల్ లైన్ తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. 1986 నాటి కథను ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా నడిపించిన తీరు అద్భుతం. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడు ఊహించని స్థాయిలో ఉంటుంది.
#6 భీమ్లా నాయక్:
ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే అయ్యప్పనుమ్ కొషియుమ్ మూవీ స్టోరీ. ఇదే కథను తీసుకొని, కొన్ని మార్పులు చేసి ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటిలో కొన్ని సినిమాకు అనుకూలంగా మారగా, కొన్ని ప్రతికూలంగా మారాయి. క్లైమాక్స్ చప్పగా ఉంటుంది. పోస్టర్ లో రిలీస్ చేసిన పవన్ రానా బైక్ పై వెళ్లే సీన్ కూడా కట్ చేశారు.
#7. వీ:
సీరియస్‌గా సాగే మైండ్ గేమ్ మూవీ ‘వీ’. నాని సీరియస్‌గా ఉంటూనే తన మేనరిజంతో అక్కడక్కడా కాస్త నవ్వించారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి హత్యలు చేసే సన్నివేశాలు చాలా క్రూరంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే మర్డర్ సీన్ వణుకు పుట్టిస్తుంది. పెద్దగా థ్రిల్ ఇవ్వని సస్పెన్స్, రివేంజ్ డ్రామా. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్‌కి మ్యాచ్ అవ్వలేదు.
#8. ఏక్ నిరంజన్:
హీరోయిన్ అన్నయ్య పాత్రను క్రిమినల్ గా చూపి ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అతను మంచివాడన్నట్లు చూపటం ట్విస్ట్ గా ఓకే గానీ జస్టిఫై అనిపించుకోదు. పోనీ ట్విస్ట్ గా భావించినా అది హీరో కి కాకపోవటంతో పెద్దగా పండలేదు. కథలో హీరో బౌంటీ హంటర్ గా పరిచయం చేస్తారు. మనకు ఇన్ఫార్మర్ల వ్యవస్ధ ఉంది కానీ బౌంటీ హంటర్ లు లేకపోవటం తో నేచురాలటికీ దూరంగా ఉంటుంది.
#9. త్రీ:
ధనుష్ నటించిన త్రీ మూవీ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో నడుస్తుంది. రామ్, జనని మరియు వారి స్నేహితుడు శంకర్ అనే మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది కథ. ప్రేక్షకుడి దృష్టిని ఎక్కువసేపు ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కథలో లేవు. క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు.
10. ఆచార్య:
ఆచార్య మూవీలో పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ కథపై ప్రేక్షకుడికి అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ ముందు సిద్ధ పాత్ర ఎంటర్ అవుతుంది. దీంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. కథలో ఎలాంటి ట్విస్టులూ ఉండవు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా, పాత సినిమాల మాదిరి ఉంటుంది.
End of Article