“కార్తికేయ-2” నుండి… “కాంతార” వరకు… 2022 లో సైలెంట్ గా వచ్చి “హిట్” అయిన 8 సినిమాలు..!

“కార్తికేయ-2” నుండి… “కాంతార” వరకు… 2022 లో సైలెంట్ గా వచ్చి “హిట్” అయిన 8 సినిమాలు..!

by kavitha

Ads

2022 లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరం ఒకటి మాత్రం గట్టిగా ప్రూవ్ అయ్యింది. అదీ ఏంటి అంటే, ప్రేక్షకులు థియేటర్స్ కి సినిమా కంటెంట్ ను చూసే వస్తున్నారు. స్టార్ వాల్యూని చూసి కాదు అని.

Video Advertisement

అయితే స్టార్ హీరో సినిమాలు ఈ 2022 లో ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి. కొన్నింటికి ఓపెనింగ్స్ వచ్చినా బ్రేక్ ఈవెన్స్ కి చాలా కష్టపడ్డాయి. కంటెంట్ బాగున్న చిన్న బడ్జెట్ సినిమాలు 2022 ని ఒక ఊపు ఊపేసాయి. ఈ 2022 సినిపరిశ్రమకు చాలా విషయాలలో మేల్కొలుపు కాల్ లాంటిది అనే చెప్పాలి. 2022 లో అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచిన ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..

1. కాంతార

ఈ చిత్రాన్ని రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది.ఈ సినిమా రూ. 400 కోట్ల వసూళ్లను సాధించింది.


2. కార్తికేయ-2

హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకి డైరెక్టర్ చందూ మోండేటి దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌ భాషల్లో విడుదలై సూపర్ డూపర్‌ హిట్‏గా నిలిచింది.


3.బింబిసార

నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన సినిమా బింబిసార. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌ గా నిలిచింది.బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంట‌సీ డ్రామా నేపథ్యంలో డైరెక్టర్‌ వశిష్ఠ్‌ ఈ మూవీని తెరకెక్కించాడు.


4.విక్రమ్‌

విశ్వనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విక్రమ్‌’.ఈ సినిమాకు లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 3న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గర సంచ‌ల‌నం సృష్టించింది. త‌మిళంలో అయితే ‘బాహుబ‌లి-2’ రికార్డును సైతంబ్రేక్ చేసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

5. లవ్ టుడే

ఈ సినిమా తమిళంలో సెన్సేషనల్ హిట్ అయింది. సినిమాలో కంటెంట్ ఉంటె పెద్ద పెద్ద స్టార్స్ అవసరం లేదని ఈ సినిమా గట్టిగా ప్రూవ్ చేసింది.ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది.


6.తిరు

కోలీవుడ్‌ హీరో ధనుష్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ధనుష్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తుంటారు.ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’ సినిమా తిరు పేరుతో ఇక్కడా రిలీజైంది. ఈ మూవీ తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి కలెక్షన్లతో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.


7.తల్లుమాల

మాలీవుడ్‌ లోని అత్యుత్తమ నటుల్లో టొవినో థామస్ ఒకరు. ఆయన నటించిన తల్లుమాల (చైన్ ఆఫ్ ఫైట్స్) బ్లాక్ కామెడీ యాక్షన్ మూవీగా వచ్చి హిట్ కొట్టింది.

8.మసూద

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి,ముందుకెళ్తోంది. విభిన్నమైన కంటెంట్ తో వచ్చిన సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ చిత్రం మసూద. ఈ సినిమాకు సినీ విమర్శకులు, అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి.


End of Article

You may also like