Ads
సినిమా లో హీరో గా చేసినపుడు కొన్ని ఎమోషన్స్ మాత్రమే చూపించగలరు, ప్రేమ, జాలి, కరుణ, వీరత్వం ఇలా. విలన్ గా అయితే క్రూరత్వం, శాడిజం లాంటి ఎమోషన్స్ ని చిత్రీకరించడానికి స్కోప్ ఉంటుంది. హీరోలు కూడా విలన్‌లుగా మారారు, నెగెటివ్ రోల్ చేసింది అందుకే.., హీరో కెరీర్‌ని లీడ్ చేస్తానప్పుడే, హీరోలుగా కాకుండా నటులుగా నిరూపించుకోవడానికి విలన్‌లుగా కూడా చేసారు.
Video Advertisement
ఇలా విలన్‌గా నటించడం కొంతమందికి మంచి మార్పు, వాళ్ల నటనా సామర్థ్యాన్ని చూపించుకునే అవకాశం ఉంటే.. కొందరికి వాళ్ల కెరీర్ గ్రాఫ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. అంతే కాకుండా కొన్ని చిత్రాల్లో హీరో పాత్రలు.. వాళ్ళు చేసే పనుల వల్ల ఆ పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..
#1 రవి తేజ
మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు చేసారు. వాటిలో ఇలియానా హీరోయిన్ గా..వచ్చిన కిక్ చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు రవితేజ.
#2 రానా దగ్గుబాటి
హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా. అతి తక్కువ కాలం లోనే తన లోని నటుడ్ని నిరూపించుకున్నాడు. బాహుబలి చిత్రం లో విలన్ గా నటించిన రానా.. నేనే రాజు నేనే మంత్రి చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.
#3 మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు చిత్రం లో నెగటివ్ గానే మొదలవుతుంది అతడి పాత్ర. తర్వాత మంచిగా మారిపోతాడు.
అలాగే బిజినెస్ మాన్ చిత్రం మొత్తం మహేష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపిస్తాడు.
#4 జూనియర్ ఎన్టీఆర్
పూరిజగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన టెంపర్ చిత్రం లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించాడు. అలాగే జై లవకుశ చిత్రం లో కూడా నెగటివ్ పాత్రలో నటించాడు.
#5 అల్లు అర్జున్
అల్లు అర్జున్ వేదం చిత్రం లో నెగటివ్ ఇంటెన్షన్స్ ఉన్న పాత్రలో నటించాడు. సినిమా చివరిలో మంచివాడిగా మారతాడు. అలాగే ఆర్య 2 లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించాడు బన్నీ.
#6 విజయ్
తమిళ హీరో విజయ్ మాస్టర్ చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించాడు.
#7 నాని
నేచురల్ స్టార్ నాని నిన్ను కోరి చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించాడు. అలాగే అంటే సుందరానికి చిత్రం లో కూడా కొంచెం నెగటివ్ టచ్ ఉన్న పాత్రలోనే నటించాడు.
#8 రామ్ చరణ్
రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన రంగస్థలం చిత్రం లో రామ్ చరణ్ పాత్రకి కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయి.
#9 నాగ చైతన్య
తమన్నా, నాగ చైతన్య జంటగా వచ్చిన 100 % లవ్ చిత్రం లో కూడా చై పాత్ర నెగటివ్ షేడ్స్ తోనే సాగుతుంది.
#10 సూర్య
తమిళ హీరో సూర్య ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్గా నటించినా.. ఎన్ జికె చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు.
#11 పుష్ప
ఈ సినిమాలో హీరో డబ్బు సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చట్టపరంగా వ్యతిరేకంగానే ఉంటాయి.
#12 వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గడ్డలకొండ గణేష్ చిత్రం లో అతడి పాత్ర నెగటివ్ షేడ్స్ తోనే సాగుతుంది.
End of Article